ఖిలాడీ దర్శకుడుకి ఆఫర్ ఇచ్చిన పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేయడానికి ఇప్పటికే డైరెక్టర్స్ ని ఫైనల్ చేసుకున్నాడు.వకీల్ సాబ్ తో సూపర్ హిట్ కొట్టిన పవన్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాడు.

 Pawan Kalyan Green Signal To Khiladi Movie Director-TeluguStop.com

అలాగే సాగర్ కె చంద్ర దర్శకత్వంలో మలయాళీ హిట్ అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ చేస్తున్నాడు.ఈ రెండు షూటింగ్ దశలోనే ఉన్నాయి.

వీటి తర్వాత జులైలో హరీష్ శంకర్ సినిమా స్టార్ట్ అవుతుంది.దాని తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఒకే చెప్పాడు.

 Pawan Kalyan Green Signal To Khiladi Movie Director-ఖిలాడీ దర్శకుడుకి ఆఫర్ ఇచ్చిన పవన్ కళ్యాణ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అలాగే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ సీక్వెల్ కూడా దిల్ రాజు ప్రొడక్షన్ లోనే ప్లానింగ్ జరుగుతున్నట్లు తెలుస్తుంది.ఇలా వచ్చే ఎలక్షన్ వరకు గ్యాప్ లేకుండా సినిమాలు చేయడానికి ప్రాజెక్ట్ లని పవన్ కళ్యాణ్ రెడీ చేసుకున్నాడు.

ఇదిలా ఉంటే తాజాగా టాలీవుడ్ లో మరో హాట్ న్యూస్ వినిపిస్తుంది.

రవితేజతో ఖిలాడీ సినిమా తెరకెక్కిస్తున్న రమేష్ వర్మ దర్శకత్వంలో సినిమా చేయడానికి పవన్ కళ్యాణ్ ఒకే చెప్పాడని టాక్ నడుస్తుంది.

రీసెంట్ గా రమేష్ వర్మ ఒక స్టొరీ లైన్ పవన్ కళ్యాణ్ కి వినిపించాడని, పూర్తి కథని సిద్ధం చేసి తీసుకొని రమ్మని అతనికి సూచించినట్లు తెలుస్తుంది.ఇది కంప్లీట్ అయ్యి నచ్చితే చేస్తానని మాట ఇచ్చినట్లు సమాచారం.

ఒకవేళ రమేష్ వర్మ స్క్రిప్ట్ ఒకే అయితే బండ్ల గణేష్ ని ఈ సినిమాకి నిర్మాతగా పెట్టె రిఫర్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.స్టార్ దర్శకులతో సినిమాలు చేయాలంటే సంవత్సరాల తరబడి వేచి చూడాలి కాబట్టి యువ దర్శకులతో అయితే స్పీడ్ గా ఎక్కువ సినిమాలు చేయడంతో పాటు కొత్త కథలు కూడా చేయడానికి ఛాన్స్ దొరుకుతుందని, అలాగే తనని కొత్తగా ఎలివేట్ చేయడానికి వారు ప్రయత్నిస్తారు.

కాబట్టి ఈ సినిమాలు ఇమేజ్ పరంగా అలాగే పొలిటికల్ పరంగా తనకి వర్క్ అవుట్ అవుతాయని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు తెలుస్తుంది.

#Vakeel Saab #Ramesh Varma #Raviteja #Pawan Kalyan #AK Remake

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు