పవన్ కళ్యాణ్ కు పవర్ స్టార్ అనే బిరుదును ఎవరిచ్చారో మీకు తెలుసా?

చిరంజీవి నట వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లో ఎన్నో విజయాలు ఉన్నాయి.తక్కువ సమయంలోనే అన్నకు తగ్గ తమ్ముడిగా పవన్ కళ్యాణ్ పేరు, గుర్తింపు, పాపులారిటీని సొంతం చేసుకున్నారు.

 Pawan Kalyan Got Power Star Title Because Of Actor Posani Krishna Murali, Pawan-TeluguStop.com

తక్కువ సమయంలోనే పవర్ స్టార్ గా ఎదిగిన పవన్ కళ్యాణ్ ను అభిమానులు ప్రేమగా పవర్ స్టార్ అనే బిరుదుతో పిలుస్తారనే సంగతి తెలిసిందే.అయితే పవన్ కళ్యాణ్ కు ఈ బిరుదు రావడం వెనుక ఆసక్తికరమైన కథ ఉంది.

అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ లో నాగబాబు నిర్మాతగా కొన్ని సినిమాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే.ఆ సినిమాలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సహ నిర్మాతగా ఉన్నారు.

ఈవీవీ సత్యనారాయణ డైరెక్షన్ లో తెరకెక్కిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో పవన్ కళ్యాణ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కెరీర్ ను మొదలుపెట్టారు.అయితే వేర్వేరు కారణాల వల్ల బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు.

ఆ తరువాత పవన్ కళ్యాణ్ ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్ లో గోకులంలో సీత సినిమాలో నటించారు.

Telugu Akkadaammai, Pawan Kalyan, Posanikrishna-Movie

తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన గోకులతై సీతై అనే సినిమాకు ఈ సినిమా రీమేక్ కావడం గమనార్హం.గోకులంలో సీత బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో పాటు నటుడిగా పవన్ కళ్యాణ్ కు మంచి పేరును సంపాదించిపెట్టింది.ఈ సినిమా రిలీజ్ సమయంలో జరిగిన ప్రెస్ మీట్ లో ప్రముఖ రచయిత పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ ను పవర్ స్టార్ అని సంబోధించారు.

Telugu Akkadaammai, Pawan Kalyan, Posanikrishna-Movie

ఆ తర్వాత పత్రికలు పవన్ గురించి కథనాలు రాసే సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని పేర్కొన్నాయి.ఆ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ సుస్వాగతం సినిమాలో నటించగా ఆ సినిమా టైటిల్ కార్డ్స్ లో మొదటిసారి పవన్ కళ్యాణ్ పేరు కంటే ముందు పవర్ స్టార్ అనే బిరుదును వేయడం జరిగింది.ఈరోజు పవన్ కళ్యాణ్ 50వ జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube