గాజువాక, భీమవరం పవన్ గెలుపు సునాయాసమేనా  

రెండు నియోజకార్గాలలో జనసేన గెలుపు నిర్ణయించేది యూత్ అంటున్న విశ్లేషకులు..

Pawan Kalyan Got Millage In Gajuwaka And Bhimavaram-janaseena,pawan Kalyan Got Millage,tdp,ysrcp

పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ ఈ ఎన్నికలలో ఎంత వరకు ప్రభావం చూపించింది. అసలు రాజకీయాలలో సరికొత్త మార్పు రావాలని, కుటుంబ పాలన నుంచి ప్రజలు బయటకి రావాలని, అలాగే చెదలు పట్టిన రాజకీయ వ్యవస్థ నుంచి ప్రజలు బయటకి వచ్చి కొత్త రక్తంకి అవకాశం ఇవ్వాలన్ని పవన్ కళ్యాణ్ పిలుపు ఏపీలో బలంగానే పని చేసింది. దీంతో అధిక సంఖ్యలో యువత పవన్ కళ్యాణ్ వెంట ఈ ఎన్నికలలో నడిచారు..

గాజువాక, భీమవరం పవన్ గెలుపు సునాయాసమేనా-Pawan Kalyan Got Millage In Gajuwaka And Bhimavaram

అయితే ఈ యువత పవన్ కళ్యాణ్ గెలుపుపై ఎంత వరకు ప్రభావం చూపిస్తారు అనేది మొదటి నుంచి సందేహాలే. ఇదిలా ఉంటే ఏపీలో పవన్ కళ్యాణ్ తన బలమైన సామాజిక వర్గ సమీకరణాలు చూసుకొని గాజువాక, భీమవరం నియోజక వర్గాలలో పోటీ చేసారు. ఇక ఈ రెండు చోట్ల పవన్ కచ్చితంగా గెలుస్తాడు అనే మాట బలంగా వినిపించింది.

అయితే స్థానిక పరిస్థితులు, క్రింది స్థాయి వరకు బలమైన క్యాడర్ లేకపోవడం, అలాగే జీరో బడ్జెట్ పోలిటిక్స్ అనేవి పవన్ కళ్యాణ్ కి కొంత ఇబ్బందిగా మారుతాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే ఈ రెండు చోట్ల పవన్ కళ్యాణ్ కి భారీ మెజారిటీ వస్తుందని, యువత ఎక్కువగా పోలింగ్ లో పాల్గొని జనసేనకి ఓటు వేసారని జనసేన నాయకులు అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఫాక్టర్ ని మీడియా తక్కువ చేసిన ప్రజలలోకి బలంగా వెళ్లిందని, దానికి రాబోయే ఫలితాలే నిదర్శనంగా ఉంటాయని చెబుతున్నారు.

మరి ఎం జరుగుతుంది అనేది తెలియాలంటే మాత్రం ఓ నెల రోజులు వేచి చూడాల్సిందే.