పవన్ గురించి వచ్చిన ఆ వార్తలు నిజం కావు.. హరీష్‌ శంకర్‌ అందుకు సాక్ష్యం

పవన్ కళ్యాణ్‌ కరోనా బారిన పడ్డ విషయం తెల్సిందే.ఆయన వయసు రీత్యా నెగటివ్ వచ్చినా కూడా కొంత కాలం పాటు విశ్రాంతి అవసరం అంటూ వైధ్యులు సూచించారని దాంతో ఆయన సినిమా ల్లో నటించేందుకు కాస్త సమయం తీసుకుంటాడనే ప్రచారం జరుగుతోంది.

 Pawan Kalyan Going To Joing Shooting Very Soon-TeluguStop.com

కనీసం మూడు నెలల వరకు ఆయన మళ్లీ కెమెరా ముందుకు రాకపోవచ్చు అంటూ వస్తున్న వార్తల్లో నిజం ఎంత అనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.పవన్‌ ఆరోగ్య విషయమై కొందరు ఆందోళన చెందుతూ ఉన్నారు.

అయితే సోషల్‌ మీడియాలో పవన్‌ విశ్రాంతి అంటూ వస్తున్న వార్తలు ఏమాత్రం నిజం కాదంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.పవన్‌ కు విశ్రాంతి అక్కర్లేదు అనేది కొందరి మాట.

 Pawan Kalyan Going To Joing Shooting Very Soon-పవన్ గురించి వచ్చిన ఆ వార్తలు నిజం కావు.. హరీష్‌ శంకర్‌ అందుకు సాక్ష్యం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్‌ కళ్యాణ్‌ ఈ నెలాఖరు నుండి అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ రీమేక్‌ షూటింగ్‌ లో జాయిన్ అవ్వబోతున్నాడు.రెండు వారాల్లో ఆ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి ఆ వెంటనే హరీష్‌ శంకర్‌ దర్శకత్వం లో సినిమా ను మొదలు పెట్టబోతున్నాడట.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే దర్శకుడు హరీష్‌ శంకర్‌ జూన్‌ మరియు జులై నెలల కోసం నటీ నటుల మరియు సాంకేతిక నిపుణల నుండి డేట్లు తీసుకుంటున్నాడట.అంటే ఆ సమయంలో షూటింగ్‌ జరుగబోఉంది.

పవన్‌ హాజరు అవ్వబోతున్నాడు అనే కదా.పవన్‌ త్వరలో షూటింగ్‌ లో జాయిన్ అవ్వబోతున్నాడు అనేందుకు హరీష్‌ శంకర్‌ సాక్ష్యంగా నిలుస్తున్నాడు.హరీష్‌ శంకర్‌ గబ్బర్‌ సింగ్‌ తర్వాత పవన్‌ తో చేస్తున్న సినిమా అవ్వడం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి.ఆయన తనదైన శైలిలో మళ్లీ అద్బుతమైన మాస్ మసాలా మూవీని ఆవిష్కరిస్తాడని అంటున్నారు.

ప్రస్తుతం సినిమా కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

#PawanKalyan #Pawan Kalyan #Harish Shankar #Vakeel Saab

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు