సంచలన నిర్ణయం దిశగా పవన్..ఫ్యాన్స్ కి ఊహించని షాక్     2018-07-18   15:39:09  IST  Bhanu C

పవన్ కళ్యాణ్ ఏమి చేసినా సంచలనమే..అయితే ఈ సారి పవన్ ప్రకటన మాత్రం ఫ్యాన్స్ కి కోలుకోలేని షాక్ ఇచ్చింది..రాజాకీయాలలోకి ఎంటర్ అయిన పవన్ కళ్యాణ్…కొంతకాలం సినిమాలని చేస్తూ మరి కొంతకాలం పోలిటిక్స్ లో వస్తూ అటూ ఇటు ఇలా రెండు పడవల మీద కాళ్ళు వేసుకుంటూ తిరగడం తో రెండు రంగాలలో అనుకున్న విజయాలు సాధించలేక పోయారు అయితే ఈ సారి ఎలా అయినా సరే ఏపీలో కింగ్ మేకర్ అవ్వాలని నిర్ణయం తీసుకున్న పవన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్టుగా ప్రకటించారు అయితే

ఎన్నికలు మొదలయ్యే లోగా పవన నుంచీ తప్పకుండా ఒక సందేశాత్మక సినిమా అయినా వస్తుందని ఆశపడ్డ పవన్ ఫ్యాన్స్ కి నిరాశే మిగిలింది..తాజగా ఈరోజు పవన్ కళ్యాణ్ చేసిన ఒక ప్రకటన ఫ్యాన్స్ ని నిరుశ్చాహ పరిచింది. ప్రజలకోసం స్వచ్చందంగా పనిచేయాలనే ఉద్దేశ్యంతోనే రాజకీయాల్లోకి వచ్చాను తప్ప అధికారం డబ్బు సంపాదించడానికి కాదు అంటూ పవన్ తెలిపారు..ఇక ఈ పాతికేళ్ల పాటు ప్రజాక్షేత్రంలోనే ఉంటూ ప్రజేసేవకు అంకితం చేస్తానని హామీ ఇచ్చారు../br>

Pawan Kalyan Gives A Big Shock To Fans-

Pawan Kalyan Gives A Big Shock To Fans

రాబోయే పాతికేళ్ళు రాజకీయాల్లోనే ఉంటానని ప్రజా సేవే ధ్యేయంగా పని చేస్తానని పిలిపు ఇచ్చారు..ఈ పాతికేళ్లు ఈ విలువలకే కట్టుబడి ఉంటానని పవన్ స్పష్టం చేశారు…జనసేన పార్టీ ఐటీ విభాగాన్నిరాయదుర్గంలో ప్రారంభించిన పవన్ ఈ వ్యాక్యలు చేశారు రాయదుర్గంలో పవన్ కళ్యాణ్ ప్రారంభించారు 10 లక్షల మంది సభ్యత్వం పొందారని అన్నారు. అయితే రెండు కోట్ల మందిని జనసేనలో సభ్యులుగా చేర్చాలన్న లక్ష్యంతో ప్రతి ఒక్కరు పనిచేయాలని పవన్ సూచించారు./br>

జనసేన ఐటీ విభాగం ఇంచార్జ్ గా తోట చంద్రశేఖర్ పని చేస్తారని తెలిపారు..ఆయన పర్యవేక్షణలో ఐటీ పని చేస్తుందని తెలిపారు…ఇక్కడ పనిచేసే వారందరితో త్వరలో ఓ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని, అక్కడ ప్రతి ఒక్కరితో సమావేశమవుతానని పవన్ హామీ ఇచ్చారు. ఇక త్వరలోనే పవన్ రెండో దశ పోరాటయాత్ర ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది..అయితే పశ్చిమలో భీమవరం నుంచీ కానీ లేదా ఏలూరు నుంచీ కానీ ఈ యాత్ర ప్రారంభం అవుతుందని టాక్ వినిపిస్తోంది..