నిహారిక పెళ్లికి పవన్‌ ఇచ్చిన గిప్ట్‌ ఏమై ఉంటుంది?

మెగా డాటర్‌ నిహారిక వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.నాగబాబు మరియు వరుణ్‌ తేజ్‌ లు తమ ఇంటి మహాలక్ష్మి నిహారికను కట్న కానుకలు మరియు విలువైన బహుమానాలు ఇచ్చి మరీ చైతన్య కు ఇచ్చి పెళ్లి చేశారు.

 Pawan Kalyan Gift To Niharika Wedding , Pawan Kalyan , Niharika Wedding , Mega F-TeluguStop.com

పెళ్లి కి మెగా ప్రముఖుల నుండి వచ్చిన బహుమానాల గురించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది.చిరంజీవి అత్యంత విలువైన ఒక ఆభరణంను నిహారిక కు బహుమానంగా ఇచ్చాడు అంటూ వార్తలు వచ్చాయి. 1.5 కోట్ల రూపాయలు విలువ చేసే ఆ ఆభరణంతో పాటు చైతన్యకు కూడా ఖరీదైన బహుమానంను చిరంజీవి ఇచ్చాడంటూ వార్తలు వస్తున్నాయి.ఇక ఇంకా మెగా హీరోలు అంతా కూడా చాలా విలువైన బహుమానాలను ఇచ్చారంటూ సమాచారం అందుతోంది.ఇంత మంది ఇన్ని ఇచ్చారు మరి పవన్‌ ఏం ఇచ్చాడు అంటూ అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

Telugu Chiranjeevi, Expensive Gifts, Necklace, Niharika, Pawangift, Pawan Kalyan

పవన్‌ కళ్యాణ్ తన అన్న కూతురు నిహారిక పెళ్లి కోసం ఏమి ఇచ్చి ఉంటాడు అంటూ మెగా అభిమానులతో పాటు ఇతరులు కూడా ఆలోచనల్లో పడ్డారు.పవన్‌ కళ్యాణ్‌ ఆర్థికంగా కాస్త ఇబ్బందుల్లో ఉన్నాడు అనే విషయం తెల్సిందే.అలా అని నిహారిక పెళ్లికి ఏమీ ఇవ్వకుండా మాత్రం ఉండడు.

ఒకానొక సమయంలో తన ఆర్ధిక సమస్యలను పట్టించుకోకుండా నాగబాబును ఆరంజ్‌ సినిమా నష్టాల నుండి బయటకు లాగిన వ్యక్తి పవన్‌ అనే విషయం అందరికి తెలిసిందే.అందేకే ఇప్పుడు పవన్‌ ఖచ్చితంగా నిహారిక కు అత్యంత ఖరీదైన బహుమానం ఇచ్చి ఉంటాడు అంటున్నారు.

అది చిరంజీవి ఇచ్చిన దాని కంటే కూడా అధికం అయ్యి ఉంటుందని అంటున్నారు.పవన్‌ ఎప్పటి లాగే తాను చేసిన సాయంను సైలెంట్‌ గా చేసి ఉంటాడు.

దాంతో పవన్‌ ఏం ఇచ్చాడు అనే విషయంలో స్పష్టత లేకుండా పోయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube