పవన్ రీ ఎంట్రీ ఖరీదు ఎన్ని కోట్లంటే..?

టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా విడుదలైన తరువాత రాజకీయాల్లో బిజీ కావడంతో కొంతకాలం సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే.పవన్ మళ్లీ వకీల్ సాబ్ సినిమాతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు.

 Pawan Kalyan Getting More 300 Crore Remuneration, Pawan Kalyan, Remuneration, Ha-TeluguStop.com

సంక్రాంతి పండుగ సందర్భంగా వకీల్ సాబ్ మూవీ టీజర్ రిలీజ్ కాగా టీజర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.పవన్ ప్రస్తుతం అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ లో, క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో కూడా ఒక సినిమా తెరకెక్కనుందని సమాచారం.పవన్ గత సినిమా అజ్ఞాతవాసి ఫ్లాప్ అయినా ఆ ప్రభావం పవన్ రెమ్యునరేషన్ పై ఏ మాత్రం పడలేదు.

మరోవైపు పవన్, చరణ్ హీరోలుగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది.తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ కు ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు.

పవన్ హీరోగా నటిస్తానంటే ఆయన సినిమాలు నిర్మించడానికి నిర్మాతలు సిద్ధంగా ఉంటారు.

Telugu Crore Rupees, Harish Shankar, Pawan Kalyan, Pawankalyan, Vakeel Saab-Late

పవన్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు రెమ్యునరేషన్ గా 50 కోట్ల రూపాయల నుంచి 55 కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.మొత్తం పవన్ ఆరు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆరు సినిమాలకు పవన్ కు 300 కోట్ల రూపాయల నుంచి 400 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ రూపంలో దక్కనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.వరుసగా సినిమాలకు కమిటవుతూ ఏడాదికి కనీసం రెండు సినిమాలు విడుదలయ్యేలా పవన్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.
రీఎంట్రీలో పవన్ కళ్యాణ్ సినిమా సినిమాకు గ్యాప్ రాకుండా జాగ్రత్త పడుతున్నారు.వకీల్ సాబ్ సినిమా సమ్మర్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉండగా అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ కూడా ఈ ఏడాది విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పవన్ రీఎంట్రీ సినిమా వకీల్ సాబ్ రిలీజ్ కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube