పవన్‌ ఎఫెక్ట్‌ : జార్జ్‌ రెడ్డికి తెలంగాణ ప్రభుత్వం నో పర్మీషన్‌  

Pawan Effect Telangana Govt Break To George Reddy Pre-release Event-nagababu,pawan Kalyan,telangana Govt

ఉస్మానియా యూనివర్శిటీ స్టూడెంట్‌ లీడర్‌ జార్జ్‌ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన చిత్రం ‘జార్జ్‌రెడ్డి’.ఈ చిత్రంలో జార్జ్‌రెడ్డి జీవితంలోని ముఖ్య సంఘటనలు చూపించేందుకు ఏర్పాట్లు చేశారు.విభిన్నమైన నేపథ్యంలో అవ్వడంతో పాటు బయోపిక్‌ అవ్వడం వల్ల ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగి పోయాయి.ప్రస్తుతం సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ వారంలోనే జార్జ్‌ రెడ్డి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Pawan Effect Telangana Govt Break To George Reddy Pre-release Event-nagababu,pawan Kalyan,telangana Govt-Telugu Trending Latest News Updates-Pawan Effect Telangana Govt Break To George Reddy Pre-release Event-Nagababu Pawan Kalyan

సినిమా ప్రారంభం అయినప్పటి నుండి పవన్‌ కళ్యాణ్‌ను సినిమా ప్రమోషన్స్‌లో భాగస్వామ్యం చేయాలని భావిస్తున్నారు.నాగబాబు ఇప్పటికే మాట్లాడుతూ జార్జ్‌రెడ్డి అంటే తనకు చాలా ఇష్టం అని, పవన్‌కు కూడా జార్జ్‌రెడ్డి అంటే అభిమానం.తాను ఈ సినిమాను పవన్‌ లేదా వరుణ్‌ బాబుతో నిర్మించాలని ఆశపడ్డాను.కాని ఈ సినిమా తెరకెక్కిందని తెలిసి సంతోషంగా ఉంది.కళ్యాణ్‌ ను చూస్తుంటే నాకు జార్జ్‌ రెడ్డి గుర్తుకు వస్తాడంటూ నాగబాబు వ్యాఖ్యలు చేశాడు.

Pawan Effect Telangana Govt Break To George Reddy Pre-release Event-nagababu,pawan Kalyan,telangana Govt-Telugu Trending Latest News Updates-Pawan Effect Telangana Govt Break To George Reddy Pre-release Event-Nagababu Pawan Kalyan

ఇక చిత్ర యూనిట్‌ సభ్యులు పవన్‌ కళ్యాణ్‌కు ఒక పాట అంకితం చేయడంతో పాటు పవన్‌ ఫ్యాన్స్‌ను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ను ఈ సినిమా వైపుకు లాగేందుకు చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రీ రిలీజ్‌ వేడుకకు పవన్‌ను ఆహ్వానించారు.రేపు ప్రీ రిలీజ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

ఇలాంటి సమయంలో తెలంగాణ పోలీసులు అనుమతి లేదు అంటూ ప్రీ రిలీజ్‌ వేడుకను అడ్డుకున్నారు.పవన్‌ కళ్యాణ్‌ వస్తే భారీ ఎత్తున స్టూడెంట్స్‌ హాజరు అవ్వడంతో పాటు రాజకీయ రచ్చ జరగే అవకాశం ఉందని భావించిన పోలీసులు జార్జ్‌ రెడ్డికి అనుమతి నిరాకరించారు.