సొంత జిల్లాలోనే బాబు కి చెక్ పెట్టనున్న పవన్       2018-04-23   04:40:32  IST  Bhanu C

పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఎవరికీ అంతుబట్టదు అప్పటికప్పుడు యాత్ర అంటారు…మరు క్షణంలోనే షూటింగ్ అంటారు రేపే ఫలానా చోట భాదితులని కలవడానికి వస్తున్నాను అని ప్రకటిస్తాడు ఇలా చేసే పనికి చెప్పే మాటలకి పొంతన ఉండదు కానీ తాను ఎంత పర్ఫెక్ట్ గా ఉనాడో రాజకీయాలలో కూడా అంతే పర్ఫెక్ట్ గా ఉండాలని అనుకుంటాడు. కేంద్రం ఏపీ చేసిన న్యాయం పై చంద్రబాబు నాయుడు ధర్మ యుద్ధం అంటూ విజయవాడలో దీక్షకి కూర్చున్న విషయం అందరికీ తెలిసిందే..

అయితే ఈ దీక్ష చేయడంతో పార్టీ కి మైలేజ్ వస్తుంది అదేవిధంగా ప్రజలలో మన మీద సానుభూతి పెరుగుతుంది అని భావించిన చంద్రబాబు ఆశలపై ఒక్క సరిగా నీళ్ళు చల్లే శాడు పవన్ కళ్యాణ్..మీడియా పై విరుచుకు పడుతూ తన తల్లిని దూషించిన విషయాన్ని పదే పదే చూపించారు అంటూ మొత్తం మీడియాని తనవైపుకి తిప్పుకున్నారు దాంతో ఒక్క సారిగా చంద్రబాబు ధర్మ దీక్ష కాస్తా సైలెంట్ అయ్యిపోయింది మీడియాలో ఎక్కడా కనిపించలేదు..అప్పటికీ కానీ అర్థం కాలేదు తెలుగుదేశం పార్టీ నేతలకి పవన్ ఆడింది గేమ్ అని..దాంతో ఖంగుతిన్న నేతలు ముక్కుమీద వేలేసుకున్నారు..

పవన్ వేసిన వ్యూహాత్మక అడుగుకి చంద్రబాబు కూడా షాక్ అయ్యారు…అయితే పవన్ ఈ సారి పవన్ కళ్యాణ్ మళ్ళీ చంద్రబాబు ని దెబ్బ కొట్టే ప్లాన్ వేశాడు…ఈ సారి ఎక్కడో కాదు చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు లోనే చంద్రబాబు కి స్కెచ్ వేశాడు పవన్..దానికి సంభందించిన వివరాలు సైతం ఈరోజు సాయంత్రంలోగా బయటపెడుతాను అని చెప్పాడు..అయితే ఈ నెల 30న తిరుపతిలో బాబు భారీ ఎత్తున దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే…ఇలాంటి వేళ.. సరిగ్గా అదే రోజున బాబు సొంత జిల్లాలోనే పవన్ ఏదైనా కీలక కార్యక్రమాన్నిప్రకటించే అవకాశం ఉందట.

అయితే పవన్ గనుకా తన కార్యాచరణ ప్రకటిస్తే చంద్రబాబు తిరుపతి లో చేపట్టే దీక్షకి నూకలు చేల్లినట్టే..అయితే చంద్రబాబు ముందే ఈ పరిణామాలని ఊహించి మీడియాని ఇప్పటి నుంచే అలెర్ట్ చేయమని సూచించారట..కానీ బాబు ఎంత సూచనలు చేసినా సరే పవన్ ప్రకటించబోయే కార్యాచరణకి తప్పకుండా మీడియా టర్న్ అవుతుందని వ్యూహం కూడా అందుకు తగ్గట్టుగానే ఉందని టాక్ వినిపిస్తోంది..ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ చంద్రబాబు దీక్షకి మైలేజ్ తగ్గించే పనిలో పవన్ సక్సెస్ అయ్యి చంద్రబాబు కి చెక్ పెట్టడం ఖాయం అంటున్నారు జనసేన వర్గాలు..