ప‌వ‌ర్‌స్టార్ ఫ్యూచ‌ర్ గ‌జిబిజీ  

Pawan Kalyan Future In Confusion-

గ‌త ఎన్నిక‌ల‌కు కాస్త ముందుగానే జ‌న‌సేన పార్టీ స్థాపించాడు ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.ఆ ఎన్నిక‌ల్లో అప్ప‌టి టీడీపీ-బీజేపీ కూట‌మికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాడు.ఆ ఎన్నిక‌ల్లో తాను ఆ రెండు పార్టీల‌కు ప్ర‌త్యేక హోదాతో పాటు కొన్ని అంశాల‌ను బేస్ చేసుకుని మ‌ద్ద‌తు ఇచ్చాన‌ని..

Pawan Kalyan Future In Confusion---

ఇప్పుడు అవి నెర‌వేర‌డం లేద‌ని ప‌వ‌న్ ఈ రెండు పార్టీల‌పై అస‌మ్మ‌తి గ‌ళం వినిపిస్తున్నాడు.ప్ర‌త్యేక హోదాతో పాటు ఏపీలో ఉన్న కొన్ని స‌మ‌స్య‌ల‌ను లేవ‌నెత్తుకుంటోన్న ప‌వ‌న్ వాటిపై ప్రాంతాల వారీగా స‌భ‌లు పెడుతూ ప్ర‌భుత్వాన్ని సుతిమెత్త‌గా నిల‌దీశే కార్య‌క్ర‌మానికి తెర‌లేపాడు.కాట‌మ‌రాయుడు ఆ త‌ర్వాత త్రివిక్ర‌మ్ సినిమా, ఆ త‌ర్వాత ఏఎం.ర‌త్నం నిర్మాత‌గా నీశ‌న్ డైరెక్ట్ చేసే సినిమాల్లో న‌టించాల్సి ఉంది.ఆ త‌ర్వాత టైం ఉంటే దాసరికి క‌మిట్ అయిన సినిమా చేయాలి.

త్రివిక్ర‌మ్‌-నీశ‌న్ సినిమాలు అయ్యే స‌రికే 2018 సంక్రాంతి వ‌చ్చేస్తుంది.అప్ప‌ట‌కీ ఎన్నిక‌ల‌కు మ‌రో యేడాది మాత్ర‌మే ఉంటుంది.


ప‌వ‌న్ ఒక్క‌సారిగా మీడియాలో స్పందించి చ‌ల్ల‌బ‌డిపోతున్నాడు.ప్ర‌జ‌ల్లోకి వెళ్లాలంటే ప‌వ‌న్ చేసే ఈ పోరాటం స‌రిపోదు.

క్షేత్ర‌స్థాయిలో ఇంకా జ‌న‌సేనకు పునాదులే లేవు.ఇక ఇటు పాలిటిక్స్‌, అటు సినిమాలు ఈ రెండిట్లోను ప‌వ‌న్ బ్యాలెన్సింగ్ కూడా స‌రిగాలేదు.కాట‌మ‌రాయుడు షెడ్యూల్స్ సైతం లేట్‌గా జ‌రుగుతున్నాయ‌ని తెలుస్తోంది.


కాట‌మ‌రాయుడు జ‌న‌వ‌రి నెలాఖ‌రుకే పూర్త‌వుతుంద‌ని అనుకున్నా.ఇప్పుడు ఫిబ్ర‌వ‌రికి కాని పూర్తి కాద‌ని అంటున్నారు.

ఇటు రాజ‌కీయంగాను ట్వీట్లు, అప్ప‌డ‌ప్పుడు స‌భ‌ల‌కే ప‌రిమిత‌మ‌వుతున్నాడు.ఏదేమైనా ప‌వ‌న్ ఈ రెండిట్లోను పాలిటిక్సా.? సినిమాలా .? అన్న‌ది తేల్చుకోవాల్సిన టైం అయితే వ‌చ్చేసింది.

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు రెండిట్లోను ప్ర‌యాణం చేస్తానంటూ కుదిరేలా లేదు.మ‌రి రాజ‌కీయ‌రంగంలోకి వ‌చ్చేసిన ప‌వ‌న్ ఎలాంటి డెసిష‌న్ తీసుకుంటాడో చూడాలి.