పవన్ కి జలక్...విజయవాడ వైసీపీ ఎంపీగా..???

రాజకీయాల్లో ఏదన్నా జరిగిపోవచ్చు, శత్రువులు మిత్రులు , మిత్రులు శత్రువులు అయిపోవడం పరిపాటే.అందులోనూ ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో ఇలాంటి వ్యవహారాలూ ఇంకాస్త ఎక్కువగా కనిపిస్తుంటాయి.

 Pawan Kalyan Friend Pvp Participating In Mp Elections From Ycp-TeluguStop.com

గత ఎన్నికల్లో టిక్కెట్లు రాకుండా ఉన్న అసంతృప్తులు ఈ సారి కూడా ఆశించి భంగ పడే అవకాశం ఉంటే పార్టీలు మారడం సర్వ సాధారణం.అయితే గతంలో టీడీపీ తరుపున విజయవాడ ఎంపీ టిక్కెట్టు ఆశించి పవన్ కళ్యాణ్ తో రాయభారాలు నెరపి చివరికి భంగ పడ్డ ప్రముఖ వ్యాపారవేత్త అయిన పీవీపీ, ఈ సారి తన రూటు మార్చుకున్నారని వినికిడి.

సినీ నిర్మాతగా , పవన్ కళ్యాణ్ తో కొంత ఆర్ధిక లావాదేవీలు ఉన్న కారణంగా పీవీపీ గతంలో టీడీపీ నుంచీ ఎంపీ గా విజయవాడ టిక్కెట్టు ఆశించారు.అయితే అప్పటికే బాబు కేసినేని వైపు మొగ్గు చూపడంతో ఇక చేసేది లేక కుదరదని చెప్పడం, పీవీపీ నిరాశ చెందటం అంతా జరిగిపోయింది.అయితే రాజకీయాల వైపు ఎక్కువగా మక్కువ చూపిస్తున్న పీవీపీ ఈ సారి టీడీపీ నుంచీ టిక్కెట్టు రాదనీ ఆశించారు.అయితే పవన్ తో గతంలో ఉన్నంత రిలేషన్ ఇప్పుడు లేకపోవడంతో జనసేన తరుపునుంచీ కూడా టిక్కెట్టు ఆశించకుండా, ఈ సారి వైసీపీ నుంచీ విజయవాడ ఎంపీగా టిక్కెట్టు ఆశిస్తున్నారని టాక్ జోరుగా వినిపిస్తోంది.

ఈ క్రమంలోనే పీవీపీ వైసీపీ కీలక నేతలతో సంప్రదింపులు జరిపినట్టుగా కూడా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.అంతేకాదు ఇప్పటికే జగన్ తో పీవీపీ మంతనాలు కూడా పూర్తి అయ్యాయని త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారని అంటున్నారు.

అయితే టిక్కెట్టు విషయంలో గతంలో ఆశించి నిరాశ చెందానని ఈ సారి తప్పకుండా టిక్కెట్టు సాధించి గెలిచి తీరుతాననే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారట.ఇదిలాఉంటే

ఫిబ్రవరి 14న గుంటూరు జిల్లా తాడేపల్లిలో జగన్ తన నూతన ఇంటి గృహప్రవేశం ఉండటంతో అదే రోజున పీవీపీ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకుని మరీ పార్టీలో చేరుతాని తెలుస్తోంది.ఏదిఏమైనా విజయవాడ నుంచి ఎంపీ గా గెలుపొంది తన ఆశయాన్ని నెరవేర్చుకోవడమే టార్గెట్ గా పెట్టుకున్నట్టుంది పీవీపీ భవిష్యత్తు వ్యూహం చూస్తుంటే.ఈ ఊహాగానాల మాటేమో కాని జగన్ అయినా పీవీపీ ఆశయాన్ని తీర్చుతాడో లేదో వేచి చూడాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube