ఇదెక్కడి న్యాయం పవనూ...?? వీర మహిళలేరి..??  

Pawan Kalyan Forgets His Promise On Lady Reservations-janasena Party,lady Recervation In Janasena,pawan Kalyan,pawan Kalyan Janasena,tdp,ycp

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనకు మహిళలు అంటే ఎంతో గౌరవమని చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను సాధిస్తానని ,మహిళా సాధికారతకు ఎనలేని కృషి చేస్తానని, చెప్తూనే వీర మహిళా పేరుతో పార్టీలో భాగాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాల వారీగా వీర మహిళా కమిటీలను ఏర్పాటు చేసి , అదేవిధంగా రాష్ట్ర వీర మహిళా విభాగానికి కూడా ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్. తన పార్టీలో మహిళలకి అన్యాయం చేశారని టాక్ వినిపిస్తోంది...

ఇదెక్కడి న్యాయం పవనూ...?? వీర మహిళలేరి..??-Pawan Kalyan Forgets His Promise On Lady Reservations

33 శాతం రిజర్వేషన్లు అని చెప్పిన పవన్ కళ్యాణ్ తానూ విడుదల చేసిన 32 మంది తొలి జాబితాలో కేవలం ముగ్గురికి మాత్రమే అవకాశాలు కల్పించడం మహిళల పట్ల తనకి ఉన్న చిత్తశుద్ధి ఎలా ఉందో అర్థమవుతోందని విమర్శకులు ఘాటుగానే విమర్శిస్తున్నారు.మాటల్లో మాత్రం 33 శాతం అని చెప్పి చేతల్లో మాత్రం 10 శాతం మాత్రమే మొదటి జాబితాలో చోటు కల్పించడం ఎంతవరకు సమన్యాయం పాటించారు అర్థమవుతోందని అంటున్నారు. అయితే తర్వాత వచ్చే జాబితాలో అయినా మహిళలకు న్యాయం చేస్తారా అంటే అది కూడా లేదని స్పష్టమవుతోంది.

ఎందుకంటే..

మొదటి జాబితాలో విడుదల చేసిన అభ్యర్థులు వారి వారి స్థానాలు కూడా జనసేన కు ఎంతో పట్టున్న కీలకమైన స్థానాలు అయితే రెండవ జాబితాలో మాత్రం పవన్ కళ్యాణ్ పేరు మినహా పెద్దగా చెప్పుకోదగ్గ అభ్యర్ధులు ఎవరూ లేరు ఒక వేళ రెండవ లిస్టు లో మహిళల పేర్లు యువకుల పేర్లు ప్రకటించినా సరే అవి జనసేన కి పెద్దగా ఓటింగ్ లేని స్థానాలు అయ్యి ఉంటాయని దాంతో పేరుకి మాత్రం మహిళలకి న్యాయం చేశామని చెప్పుకోవడానికి ఉపయోగపడతాయని అంటున్నారు.

ఇదిలాఉంటే జనసేన పార్టీకి ముందు నుంచీ జెండా మోస్తూ తిరిగిన ఎంతో మందికి పార్టీ హ్యాండ్ ఇచ్చిందట. నిరుపేద, మధ్యతరగతి యువతని పోటీలో నిలపెడుతామని చెప్పిన పవన్ కళ్యాణ్ ఆదిశగా అడుగులు వేసింది లేదు.

కేవలం బాగా డబ్బు ఖర్చు చేసే వారిని మాత్రమే ఎంపిక చేసుకున్నట్టుగా తెలుస్తోంది. హడావిడిగా ఎటువంటి ఆలోచన లేకుండా మొదటి జాబితా ప్రకటించిన పవన్ కళ్యాణ్ అందులో సామాజిక తూకం పాటించలేదని విమర్శలపాలవుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ తుది జాబితాలో అయినా సరే ఎలాంటి అభ్యర్ధులని పరిగణలోకి తీసుకుంటారో వచ్చి చూడాల్సిందే...