జనసేన అభ్యర్ధుల ఎంపికలో పవన్ వ్యూహం ఇదేనా..??     2018-10-19   08:55:39  IST  Sai Mallula

తెలుగు రాష్ట్రాలు విడిపోక మునుపు ఏపీలో ఎన్నికలు అంటే కేవలం కాంగ్రెస్ ,టీడీపీ పార్టీల మధ్యలోనే జరిగేది. ఆ తరువాత చిరంజీవి ఎంట్రీ తో ముక్కోణపు పోటీ జరగడంతో ఓట్ల చీలిక జరిగి వైఎస్ లాభపడ్డారు, చిరు తన ప్రరాపాని కాంగ్రెస్ లో విలీనం చేసేశారు..విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో టీడీపీకి , వైసీపీకి జరిగిన పోరులో అప్పటికే పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ పోటీ చేయకుండా బాబు కి అనుకూలంగా మద్దతు తెలుపడంతో బాబు అధికారంలోకి వచ్చారు..అయితే మళ్ళీ 2019 ఎన్నికల్లో అంటే దాదాపు 10 ఏళ్ల తరువాత ఏపీలో త్రికోణ పోరు జరుగుతున్న నేపధ్యంలో ఏపీ రాజకీయాలు అందరిలో ఎంతో ఉత్ఖంటని రేపుతున్నాయి.

Pawan Kalyan Follows Special Root About Selecting Candidates-

Pawan Kalyan Follows Special Root About Selecting Candidates

ఎన్నికలకి ఇంకా ఆరు మాసాల సమయం మాత్రమే ఉండటంతో టీడీపీ,వైసీపీలు అభ్యర్ధుల విషయంలో ఒక క్లారిటీ తో ఉంటే పవన్ కళ్యాణ్ జనసేన మాత్రం కేవలం ఒకే ఒక అభ్యర్ధిని ప్రకటించి సైలెంట్ అయ్యింది..అయితే ఈ సైలెంట్ వెనుక కారణం ఏమిటి అంటే దానికి భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి.. పొలిటికల్ సర్కిల్స్ లో ఇపుడిదే చర్చనీయాంశంగా మారింది. అభ్యర్ధుల ఎంపికలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాలా ఈజీ మార్గాన్ని ఎంచుకున్నట్లుగా అర్థమవుతోందని విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు..ఇంతకీ ఏమిటా ఈజీ మార్గం అంటే.

కొత్తగా అభ్యర్ధులను తయారు చేసుకోవటమో లేకపోతే కొత్త వారిని పోటీలోకి దింపటమో చేసే ఉద్దేశ్యంలో పవన్ లేనట్లు స్పష్టమవుతోంది…మరి ఏమి చేస్తారు అంటే ఇతర పార్టీల్లోని అసంతృప్తులను తన పార్టీలోకి లాక్కుని టిక్కెట్లివ్వాలని పవన్ నిర్ణయించారని తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఇరు పార్టీలలో సిట్టింగు ఎంఎల్ఏలున్న చోట్ల ఎటూ ఇతరులకు టిక్కెట్లిచ్చే కొంతమందికి తప్పితే దాదాపు లేనట్లే. మరి ఆయతా స్థానాలలో టిక్కెట్ల కోసం ఆశించే సిట్టింగులకంటే బలమైన నేతలు చాలా చోట్ల ఉండనే ఉన్నారు కూడా..మరి అలాంటి వారి సంగతి ఏమిటి..?

Pawan Kalyan Follows Special Root About Selecting Candidates-

అదే సమయంలో ఆయా పార్టీలలో ద్వితీయశ్రేణి నేతలుంటారు వారిలో నియోజకవర్గంపై పట్టున్న వారుంటారు. మరి వారి సంగతి ఏమిటి..? ఇప్పుడు జనసేన చూపు మొత్తం అలాంటి వారిపైనే ఉందని విశ్వసనీయంగా తెలుస్తోంది..అంతేకాదు అలాంటి వారి పేర్లతో కూడిన పెద్ద జాబితానే సిద్దం చేసి ఉంచిందట..నిజానికి రెండు పార్టీల్లో పోటీ చేసే అవకాశం రాని వాళ్ళు,..వారిలో కూడా బలమైన నాయకులకి జనసేన గేలం చేస్తోందట..అయితే ఈ మొత్తం భాద్యతలని పార్టీలో మొన్ననే చేరిన నాదెండ్ల మనోహర్ కి అప్పగించారట పవన్ కళ్యాణ్..అయితే జనసేనలోకి రావడానికి వారు కూడా ఉశ్చాహం చూపుతున్నారని తెలుస్తోంది..మరి పవన్ వేసిన ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది భవిష్యత్తులో తేలిపోతుంది.