చంద్రబాబు ని ఫాలో అవుతున్న జనసైనికులు  

Pawan Kalyan Follows Chandrababu-cm Chandrababu,janasena,pawan Kalyan,tdp,చంద్రబాబు,పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ ఏపీ రాజకీయాల్లో చరిత్ర సృష్టిస్తుంది.రికార్డులు తిరగరాస్తుంది..

చంద్రబాబు ని ఫాలో అవుతున్న జనసైనికులు-Pawan Kalyan Follows Chandrababu

అంటూ మొదట్లో సోషల్ మీడియాలో హల్చల్ చేసిన జనసైనికులు ఒక్కసారిగా తమ వాయిస్ మార్చుకున్నారు. తానొక పక్కా పొలిటీషియన్ అని అందుకు తానేమి తీసిపోనని అతి తక్కువ కాలంలో ప్రూఫ్ చేసుకున్న పవన్ కళ్యాణ్ అందుకు తగ్గట్టుగానే తన ఓటమికి సాకులు వెతుక్కుంటున్నారు.

ఎంతన్నా చంద్రబాబు తో దోస్తీ కదా ఆ మాత్రం సాకులు చెప్తారులెండి అంటున్నారు విమర్శకులు. ఇదిలాఉంటే పవన్ కళ్యాణ్ ఆది నుంచీ ఫ్యాన్స్ నా మీడియా, ఫ్యాన్స్ నా పేపర్ అంటూ తెగ డబ్బాలు కొట్టి మరీ వారికి మరో పని లేకుండా చేసి పార్టీ కార్యక్రమాలు తీవ్ర తాయిలో వారిచే ప్రచారం చేయించుకున్నారు.

ఇప్పుడు కూడా అదే రీతిలో జనసేన ఫెయిల్యూర్ గురించి తమ పరువు పోగొట్టుకోకుండా ఎంతో హుందాగా ప్రజలని ఒప్పించి, మెప్పు పొందాలని సోషల్ మీడియాలో మళ్ళీ మరో కొత్త కోణంలో ప్రచారం చేసుకుంటున్నారు.

జనసేనకి ప్రజల్లో పాజిటివ్ ఫీల్ తెచ్చేలా సాకులు వెతుక్కుని యూటర్న్ తీసుకున్నారు. అంతేకాదు పవన్ షో అట్టర్ ఫ్లాప్ అయితే వారు చెప్పబోయే సాకులు ఇప్పటికే సోషల్ మీడియాలో జనసైనికులు చేసే పోస్ట్ లు హల్చల్ చేస్తున్నాయి కూడా. ఓ సారి ఆ ఇంట్రెస్టింగ్ స్టొరీ సారీ సారీ జనసేన యూ టర్న్ స్టొరీ లోకి ఒక్క సారి వెళ్తే…

అసలు సిసలైన రాజకీయ నాయకుడికి అర్థం తమ నాయకుడు పవన్ కళ్యాణ్ అని, ఒక్క పైసా కూడా డబ్బులు పంచకుండా ఎన్నికల్లో పోటీ చేసిన ఘనత పవన్ కళ్యాణ్ సొంతమని సోషల్ మీడియాలో పోస్టులతో నింపేస్తున్నారు. ఒకవేళ పవన్ పవన్ కళ్యాణ్ ఓడిపోయినా లేక జనసేనకి ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోయినా దానికి కారణం కేవలం డబ్బులు పంచకపోవడమేనని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

వాటిని వాట్సాప్ గ్రౌప్స్ లో షేర్స్ చేసుకుంటూ ప్రచారం చేస్తున్నారు..

ప్రత్యర్ధి పార్టీ అభ్యర్ధి కోట్ల రూపాయలు ఖర్చులు చేస్తున్నరాని తెలిసినా పవన్ కళ్యాణ్ డబ్బులు పంచడాని వ్యతిరేకించారని అసలు సిసలైన నాయకుడంటే మా పవన్ కళ్యాణ్ అంటున్నారు జనసైనికులు. అయితే తమ ఓటమిని ముందుగానే గ్రహించిన పవన్ కళ్యాణ్ తానూ మాత్రం సైలెంట్ గా ఉండి జనసైనికులతో ఇలాంటి పోస్ట్ లు పెట్టిస్తున్నారని. ఓటమికి సాకులు చెప్పడంలో యూటర్న్ తీసుకోవడంతో పవన్ కళ్యాణ్ చంద్రబాబుని మించిపోయారని అంటున్నారు రాజకీయ పండితులు.