పశ్చిమ నుంచీ మొదటి టిక్కెట్టు వారికే..పవన్ నిర్ణయం       2018-06-25   01:09:25  IST  Bhanu C

ఏపీలో ఎన్నికల హడావిడి మొదలయ్యింది ప్రధాన ప్రతిపక్ష పార్టీ ,అధికార పార్టీలు సీపీఎం సీపీఐ లాంటివాళ్ళు ఎప్పటిలానే వారి వారి వ్యుహాలకి పదును పెడుతూ వచ్చారు అయితే జనసేన పార్టీ కూడా అందుకు తగ్గట్టుగానే వ్యుహాలని సిద్దం చేస్తోంది.అయితే ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా సరే ముఖ్యంగా పశ్చిమగోదావరి జిల్లాలో చక్రం తిప్పగలికి ఎక్కవ సీట్లు గెలిస్తే చాలు అయితే ఈ విషయాన్ని జనసేన పూర్తిగా వంటబట్టించుకుంది. అందుకు తగ్గట్టుగా పశ్చిమలో పాగాకోసం పాకులాడుతోంది..అంతేకాదు పశ్చిమ సీట్ల విషయంలో పవన్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది..అదేంటంటే..

పశ్చిమగోదావరి జిల్లా అంటే మెగా ఫ్యామిలీ కి సొంత జిల్లా..పవన్ సామాజిక వర్గం కూడా ఎక్కువగా ఉన్న జిల్లా కూడా అయితే ఈ జిల్లాలో పవన్ కళ్యాణ్ తన పార్టీని గ్రౌండ్ లెవెల్ కి తీసుకుని వెళ్ళాలి అంటే ఎదో ఒక సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేయాలి ఆ నిర్ణయం మొత్తం రాష్ట్రంలోఅని అన్ని జిల్లాలోకి ఒకే సారి ఇంపాక్ట్ అవ్వాలి ఇదే పవన్ టార్గెట్ అందుకే పశ్చిమలో ఒక భారీ ప్లాన్ సిద్దం చేశాడు..సుదీర్గంగా పార్టీ వ్యుహకర్తలతో చర్చించిన తరువాత పశ్చిమలో గౌండ్ సర్వే చేసిన తరువాత ఒక నిర్ణయానికి వచ్చాడు.

ఇప్పటి వరకూ పశ్చిమ పేరు చెప్తేనే గుర్తుకు వచ్చేది పచ్చని పొలాలు..తోటలు..భూమి తల్లిని సుందరవనంగా తీర్చి దిద్దే రైతన్నఅయితే అలాంటి రైతన్న పశ్చిమ కీర్తిని ఎల్లకాలం నిలబెడుతూ ఉంటాడు..సాటి రైతు కష్టం మరొక రైతుకి మాత్రమే తెలుస్తుంది అనే ఉద్దేశ్యంతో పశ్చిమ నుంచీ డెల్టా ప్రాంతంలో ఎదో ఒక స్థానంలో మొట్ట మొదటి సీటుని రైతులకి ఇవ్వాలని పవన్ భావిస్తున్నాడట..ఇదే నిర్ణయాన్ని పార్టీలో కీలక నేతలు కూడా ఒకే చెప్పారట.. రైతుకి ఇప్పటి వరకూ చట్టసభలకి వెళ్ళే అవకాశం ఏ పార్టీ ఆలోచన చేయలేదు. అయితే పవన్ కళ్యాణ్ చేసిన ఈఆలోచన పై త్వరలోనే ఒక క్లారిటీ తో కూడిన అధికారిక వెల్లడి కూడా చేస్తారట.

అంతేకాదు పశ్చిమలో సామాజిక వర్గాల వారిగా ఓటు శాతం చూస్తే బీసీలు అధిక శాతం మంది ఉన్నారు అయితే ఇదే బీసీల నుంచీ రైతు బిడ్డని ఎంపిక చేస్తే అటు రైతులని ఇటు బీసీలని ఒకేసారి ఆకర్షించిన వారు అవుతారు.. ఎలాగో కాపుల ఓట్లు పడనే పడతాయి..యూత్ ఓట్లు సైతం పవన్ కి వెన్నంటి ఉంటాయి అని పవన్ ఆలోచన అంతేకాదు పశ్చిమలో గనుకా రైతులకి సీటు ఇస్తామని అధికారికంగా వెల్లడించినప్పుడు మిగిలిన జిల్లాల నుంచీ వచ్చిన స్పందన బట్టి సర్వే చేయించి జిల్లాకి ఒక రైతులకి సీట్లు ఇచ్చే ఆలోచన కూడా చేయనున్నాడట పవన్ కళ్యాణ్..మరి ఈ సరికొత్త ప్రయోగం ఫలిస్తుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి .