ఆ విషయంలో మొదటి సారి వైసీపీకి పవన్ మద్దతు  

Pawan Kalyan First Time Praises On Am Cm Jagan - Telugu Ap Politics, First Time Praises On Am Cm Jagan, Janasena, Pawan Kalyan, Ysrcp

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ రాజకీయాలలో చంద్రబాబు కంటే జగన్ కి పెద్ద తలనొప్పిగా మారిన వ్యక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్.వైసీపీ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని, అందులో లోపాలని వేలెత్తి చూపిస్తున్న పవన్ కళ్యాణ్ మీద అధికార పార్టీ కూడా పీకల్లోతు కోపంతో ఉంది.

Pawan Kalyan First Time Praises On Am Cm Jagan - Telugu Ap Politics, First Time Praises On Am Cm Jagan, Janasena, Pawan Kalyan, Ysrcp-Political-Telugu Tollywood Photo Image

అయితే పవన్ కళ్యాణ్ మీద అవినీతి విమర్శలు చేయడానికి అవకాశం లేకపోవడంతో వ్యక్తిగత విమర్శలతో దాడి చేస్తూ జనసేన ఇమేజ్ ని దెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్నారు.అయితే పవన్ కళ్యాణ్ మాత్రం వైసీపీ నేతల దాడిని సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి జగన్ చేసిన ఒక పనిపై ప్రశంసలు కురిపించారు.

కర్నూల్ లో అత్యాచారం చేసి హత్య చేయబడ్డ సుగాలి ప్రీతీకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పవన్ కళ్యాణ్ భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించారు.

అయితే వైసీపీ నేతలు కొందరు దీనిని వివాదం చేసి పవన్ కళ్యాణ్ పై రాజకీయ విమర్శలు చేశారు.అయితే తాజాగా మూడో విడత కంటి వెలుగు కార్యక్రమం కోసం కర్నూల్ వెళ్ళిన ముఖ్యమంత్రి జగన్ సుగాలి ప్రీతి తల్లిని పిలిపించి ఆమెతో మాట్లాడారు.

సుగాలి ప్రీతి కేసుని సిబిఐకి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు.ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయంపై పవన్ కళ్యాణ్ తాజాగా హర్షం వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేశారు.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సుగాలి ప్రీతీ కుతుమ్బాకి కొంత ఊరట దొరుకుతుందని అన్నారు.ఈ కేసులో చనిపోయిన బాధితురాలి కుటుంబానికి న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

తాజా వార్తలు