పవన్ క్రిష్ సినిమా.. ఓ కోహినూర్ వజ్రం!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన 26వ చిత్రంగా బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’ను రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాకు వకీల్ సాబ్ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.

 Pawan Kalyan Fights For Kohinoor Diamond In Krish Movie-TeluguStop.com

ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే సక్సెస్‌ను అందుకోవడానికి పవన్ రెడీ అవుతున్నాడు.

ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ మూవీని దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

ఇప్పటికే ఈ సినిమాను లాంఛ్ చేసిన చిత్ర యూనిట్, ఈ చిత్ర షూటింగ్‌లో త్వరలో పాల్గొనూందుకు పవన్ రెడీ అవుతున్నాడు.ఇక ఈ సినిమాలో పవన్ రాబిన్‌హుడ్ తరహా పాత్రలో నటిస్తున్నాడు.

కాగా ఈ సినిమాలో భారతదేశానికి చెందిన కోహినూర్ డైమండ్‌ను బ్రిటీష్ వారి దగ్గర నుండి దొంగలించేందుకు పవన్ ప్రయత్నిస్తాడట.

ఇలాంటి రాబిన్‌హుడ్ తరహా పాత్రలో పవన్ ఎలా కనిపిస్తాడా అనే అంశం చాలా ఆసక్తిగా మారింది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారా అనే అంశం మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది.తమిళ నిర్మాత ఏఎం రత్నం ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube