మళ్లీ వరల్డ్‌ రికార్డ్‌ చేయడం ఖాయం అంటున్న పవన్ ఫ్యాన్స్‌

పవన్‌ కళ్యాణ్ అభిమానులు తల్చుకుంటే ఏదైనా చేస్తారు.తమ అభిమానంతో ఏకంగా వరల్డ్ రికార్డును దక్కించుకున్న ఘనత వీరిది అనడంలో సందేహం లేదు.

 Pawan Kalyan Fans Want To Trend Pawanotsavam Hash Tag , Film News,  Happy Birthd-TeluguStop.com

అద్బుతమైన రికార్డులను దక్కించుకున్న పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు మళ్లీ ఒక రికార్డు కోసం ప్రయత్నాలు చేయబోతున్నారు.ఈ నెల 14వ తారీకున పవనోత్సవం అనే హ్యాష్‌ ట్యాగ్‌ ను సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేస్తూ పవన్‌ గురించి ట్వీట్స్ చేయాలంటూ పిలుపునిచ్చారు.

ట్విట్టర్‌ లో ఇప్పటి వరకు మరే స్టార్‌ హీరోకు కూడా దక్కని రికార్డును పవన్‌ కోసం కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెబుతున్నరు.ప్రముఖ స్టార్‌ హీరో లు ముఖ్యంగా తెలుగు స్టార్‌ హీరోలకు ట్విట్టర్‌ లో మంచి ఫాలోయింగ్‌ ఉంటుంది.

పవన్ ఫాలోవర్స్‌ ఆయన రికార్డు బ్రేకింగ్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు.

పెద్ద ఎత్తున అంచనాలున్న పవనోత్సవం ట్వీట్స్‌ తో హోరెత్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

పవన్‌ కళ్యాణ్‌ బర్త్‌ డే 50 రోజులు ఉండగా ఈ పవనోత్సవం ట్వీట్స్‌ ను ట్రెండ్‌ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.పవన్‌ కళ్యాణ్‌ పుట్టిన రోజు సెప్టెంబర్‌ 2 న అనే విషయం తెల్సిందే.

భారీ అంచనాలున్న పవన్‌ కళ్యాణ్‌ సినిమాలు రూపొందుతున్నాయి.బర్త్‌ డే సమయంలో ఆ సినిమాల తాలూకు ఫస్ట్‌ లుక్‌ లేదా మరేదైనా పోస్టర్‌ లు వస్తాయని అంటున్నారు.

Telugu Happy Pawan, Telugu, Pawan Hbd, Pawan Kalyan, Pawanostavam-Movie

ఆ సమయంలో ట్రెండ్‌ అవ్వడం కామన్‌.కాని ఇప్పుడు ట్రెండ్‌ చేయడం చాలా అరుదుగా ఉంటుంది.అందుకే బర్త్‌ డే 50 డేస్‌ ఉండగానే ట్రెండ్‌ చేయడం వల్ల ప్రత్యేకంగా నిలువ వచ్చు అంటున్నారు.గత ఏడాది కూడా అడ్వాన్స్ హ్యాపీ బర్త్‌ డే ట్వీట్స్ కు విపరీతమైన స్పందన వచ్చింది.

అందుకే ఈ ట్వీట్‌ లు ఎలాంటి స్పందన దక్కించుకుంటాయి ఎలా రికార్డులు దక్కించుకుంటాయి అనేది ఆసక్తికర విషయంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube