పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ ధైర్యం చేయలేక పోతున్నారా?

పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌కు సోషల్‌ మీడియాలో ఉన్న బలం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఇంతకు ముందు పవన్‌ కళ్యాణ్‌ పేరుతో ట్విట్టర్‌లో ఆయన ఫ్యాన్స్‌ రికార్డులు సృష్టించారు.

 Pawan Kalyan Fans Not Interested  Common Dp Record, Birthday Hastag, Pawan Birth-TeluguStop.com

అనేక సోషల్‌ మీడియా రికార్డ్‌ పవన్‌ పేరుతో ఉన్నాయి.అయితే ఇటీవల మహేష్‌బాబు ఫ్యాన్స్‌ నమోదు చేసిన రికార్డును బ్రేక్‌ చేసేందుకు పవన్‌ ఫ్యాన్స్‌కు ధైర్యం చాలడం లేదు.మహేష్‌బాబు బర్త్‌డేకు ఆయన ఫ్యాన్స్‌ ఏకంగా ఆరు కోట్ల ట్వీట్స్‌ను చేశారు.24 గంటల్లో ఆ స్థాయి ట్వీట్స్‌ అంటే మామూలు విషయం కాదు.

మొదట పవన్‌ కళ్యాణ్‌ బర్త్‌డే కామన్‌ డీపీకి మహేష్‌బాబు ఫ్యాన్స్‌ రికార్డును బద్దలు కొట్టాలనుకున్నారు.కాని ఇప్పుడు ఆరు కోట్లు అంటూ నమోదు అవ్వడంతో ఆ స్థాయి వరకు వెళ్లకుంటే పరువు పోతుందేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కామన్‌ డీపీకి ఎక్కువ స్పందన ఉండక పోవచ్చు.అందుకే బర్త్‌డే రోజు ఆ రికార్డును బద్దలు కొట్టే విషయమై ఆలోచిస్తాం అన్నట్లుగా పవన్‌ ఫ్యాన్స్‌ ఉన్నారట.రికార్డు బ్రేకింగ్‌ ట్వీట్స్‌ చేయడంలో పవన్‌ ఫ్యాన్స్‌ ఎప్పుడు ముందు ఉంటారు.

Telugu Hastag, Mahesh Fans, Pawan, Pawankalyan-

కాని ఈసారి మాత్రం మహేష్‌బాబు ఫ్యాన్స్‌ చేసిన రచ్చను మనము చేయగలమా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని, దాంతో ట్రెండ్‌ విషయంలో కాస్త వెనుక ముందు ఆడుతున్నారు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.రికార్డు బ్రేక్‌ చేసే ఉద్దేశ్యంతో ట్రెండ్‌ మొదలు పెట్టి చివరకు నాలుగు అయిదు కోట్ల వరకు వెళ్లి ఆగితే పరువు పోవడం ఖాయం.మహేష్‌ ఫ్యాన్స్‌ ఆ సమయంలో ఎక్కేయడం ఖాయం.

అందుకే చేతులారా పరువు పోగొట్టుకోవడం ఎందుకు అంటున్నారు. పవన్‌ బర్త్‌డే రోజు ఎలాంటి హడావుడి లేకుండా ట్విట్టర్‌లో ఆ రికార్డును బ్రేక్‌ చేసేందుకు ప్రయత్నాలు చేయాలని నిర్ణయించారు.

ప్రస్తుతానికి కామన్‌ డీపీతో ప్రయోగం చేయాలనుకోవడం లేదట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube