పవన్ ఫ్యాన్స్‌ అమెజాన్‌ రికార్డ్‌ ను కూడా వదలబోవడం లేదు...

పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్ తల్చుకోవాలే కాని ఎంతటి రికార్డ్‌ అయిన వారికి దక్కాల్సిందే.ముఖ్యంగా ఆన్ లైన్ రికార్డ్‌ ల జోరు వారికి కొత్తేం కాదు.

 Pawan Fans Ready For Vakeel Saab Movie Amazon Prime Streaming , Vakeel Saab In A-TeluguStop.com

పవన్ కళ్యాణ్‌ గురించి సోషల్‌ మీడియాలో వారు చేసే పోస్ట్‌ లు ఏకంగా ప్రపంచ రికార్డును నమోదు చేశాయి.ఇక పవన్ కళ్యాణ్‌ సినిమాలకు సంబంధించిన వీడియోలు మరియు ఫొటోలు అన్ని కూడా బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్ రికార్డులు గా నిలిచాయి.

మొత్తంగా డిజిటల్ వేదికగా పవన్ కళ్యాణ్‌ ను మరే హీరో టచ్ చేయలేని విధంగా పలు రికార్డులను ఆయన అభిమానులు దక్కించుకున్నారు.ఇప్పుడు అమెజాన్ లో వకీల్‌ సాబ్‌ స్ట్రీమింగ్‌ అవ్వబోతున్న నేపథ్యంలో భారీ ఎత్తున రన్‌ టైమ్‌ ను రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

పవన్‌ కళ్యాణ్‌ వకీల్‌ సాబ్‌ అమెజాన్‌ లో నేడు అర్థరాత్రి నుండి స్ట్రీమింగ్‌ కానున్న విషయం తెల్సిందే.

ఇప్పటికే పవన్‌ అభిమానులు థియేటర్లలో వకీల్‌ సాబ్‌ విడుదల సందర్బంగా రచ్చ చేశారు.

కాని సినిమా విడుదల సమయంలో కరోనా సెకండ్‌ వేవ్‌ మొదలై మొత్తం రచ్చ రచ్చ అయ్యింది.అందుకే అమెజాన్‌ లో చాలా త్వరగా ఈ సినిమా ను స్ట్రీమింగ్‌ చేసేందుకు తీసుకు వచ్చారు.

అందుకే వకీల్‌ సాబ్‌ ను అత్యధికంగా చూసి అమెజాన్ లో టాప్‌ ట్రెండ్‌ లో ఉండేలా చేయడంతో పాటు అత్యధిక వ్యూస్ మరియు రన్ టైమ్‌ ను దక్కించుకున్న సినిమా గా వకీల్‌ సాబ్‌ ను నిలపాలని భావిస్తున్నారు.ప్రస్తుతం అమెజాన్ లో ఉన్న రికార్డులన్నింటిని కూడా మూట కట్టి బయట పడేసేలా ప్లాన్‌ చేస్తున్నారు.

వేణు శ్రీరామ్‌ దర్శకత్వం లో రూపొందిన వకీల్‌ సాబ్‌ ను దిల్‌ రాజు నిర్మించాడు.శృతి హాసన్ హీరోయిన్‌ గా నటించగా నివేథా థామస్‌, అంజలి మరియు అనన్య లు కీలక పాత్రల్లో నటించాడు.

ప్రకాష్‌ రాజ్‌ కీలక పాత్రలో నటించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube