నిరుద్యోగంపై యుద్ధం ప్రకటిస్తా! పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు!  

జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ఎన్నికల మేనిఫెస్టోను తెలియజేసిన పవన్ కళ్యాణ్..

  • ఏపీ రాజకీయాల్లో తనదైన శైలిలో దూసుకుపోతున్న నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తాజాగా రాజమహేంద్రవరంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ జనసేన సైనికులను ఉద్దేశించి తన ప్రసంగం ప్రారంభించాడు. ఇందులో ఉద్వేగభరితంగా ప్రసంగించిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మేనిఫెస్టో ద్వారా ప్రజల కోసం తాను ఏం చేయబోతున్నాను అనే విషయాన్ని తెలియజేసే ప్రయత్నం చేశాడు.

  • జనసేన పార్టీ అధికారంలోకి వస్తే 60 ఏళ్లు దాటిన రైతులకు నెలకు ఐదు వేల రూపాయల పెన్షన్ ఇస్తాం అని తెలియజేసారు. అలాగే రైతులకు ఎకరాకు 8000 రూపాయలు ఇస్తానని, ఒకవేళ బడ్జెట్ ఉంటే పదివేల రూపాయలు ఇస్తామని స్పష్టం చేశారు, అలాగే నిరుద్యోగులు రాష్ట్ర పరిధిలో ఏ ప్రభుత్వ ఉద్యోగానికైనా ఒకసారి కడితే ఎన్నిసార్లైనా ధరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పిస్తానని హామీ ఇచ్చారు. అలాగే తాను నిరుద్యోగులకు ఐదేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తానని పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో తెలియజేశారు.