పవన్ సినిమా ఫ్లాప్ అయినందుకు పండగ చేసుకున్న ఫ్యాన్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ ఇస్తుండటంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్న సంగతి తెలిసిందే.బాలీవుడ్‌లో సూపర్ హిట్‌గా నిలిచిన పింక్ చిత్రాన్ని వకీల్ సాబ్ పేరుతో రీమేక్ చేస్తున్నాడు పవర్ స్టార్.

 Pawan Kalyan Fans Happy For Johnny Flop, Pawan Kalyan, Johnny, Renu Desai, Vakee-TeluguStop.com

అయితే ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటేందుకు పవన్ రెడీ అవుతున్నాడు.అయితే పవన్ నటించిన ఓ సినిమా అట్టర్ ఫ్లాప్‌గా నిలిచినందుకు పవన్ ఫ్యాన్స్ ఇప్పుడు పండగ చేసుకుంటున్నారు.

ఏంటీ.పవన్ సినిమా ఫెయిల్ అయినందుకు ఫ్యాన్స్ ఇప్పుడు పండగ చేసుకోవడం ఏమిటి అనుకుంటున్నారా? అవును.ఆ సినిమా గనక సూపర్ హిట్ అయ్యి ఉంటే, పవన్ ఈపాటికే సినిమాల నుండి వెళ్లిపోయే వాడినని చెప్పడంతో వారు ఈ కామెంట్ చేస్తున్నారు.గతంలో పవన్ డైరెక్ట్ చేస్తూ నటించిన జానీ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యింది.

అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్‌ఫ్లాప్‌గా నిలిచింది.కాగా ఇటీవల ఈ సినిమా ఫ్లాప్ గురించి పవన్ ఓ కామెంట్ చేశారు.

గతంలో జానీ సినిమాను డైరెక్ట్ చేస్తున్నప్పుడు తనకు చాలా మంది సూచనలు సలహాలు ఇచ్చారని, అయినా తనకు తోచిన విధంగా సనిమాను తెరకెక్కించానని ఆయన అన్నారు.

అయితే ఈ సిననిమా గనక విజయం సాధించి ఉంటే, తాను ఖచ్చితంగా హీరోగా సినిమాలకు దూరం అయ్యే వాడిని అన్నారు.

దీంతో పవన్ సినిమాల్లో నటించకపోతే తాము తట్టుకోలేక పోతామని, జానీ సినిమా ఫెయిల్ కావడమే మంచిదైందని ఫ్యాన్స్ అంటున్నారు.ఇక జానీ తరువాత పవన్ ఫాలోయింగ్ ఎలా పెరిగిందో వారు ఈ సందర్భంగా తెలిపారు.

ఏదేమైనా తమ అభిమాన నటుడు సినిమాల్లో లేకపోవడం తాము తట్టుకోలేమని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube