హరీష్ శంకర్ పై పవన్ ఫ్యాన్స్ ఫైర్‌

పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్బంగా భీమ్లా నాయక్‌.హరి హర వీరమల్లు ఇంకా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ వస్తాయని అంతా ఆశించారు.

 Pawan Kalyan Fans Fire On Harish Shankar , Film News, Gabbar Singh, Harish Shank-TeluguStop.com

అన్నట్లుగానే వచ్చాయి.సురేందర్ రెడ్డి మూవీ నుండి కూడా చిన్న పాటి కాన్సెప్ట్‌ పోస్టర్‌ ను విడుదల చేయడం జరిగింది.

కాని హరీష్ శంకర్‌ నుండి అంతకు మించి అన్నట్లుగా ఏమైనా వస్తుందేమో అని అంతా ఊహించారు.కాని గత బర్త్‌ డే సందర్బంగా ఏదైతే పోస్టర్ ను విడుదల చేశాడో అదే మళ్లీ రిపీట్‌ చేశాడు.

అయితే ఈసారి పవన్ చేతిలో గన్ పెట్టి ఉంచాడు.పవన్ తో హరీష్‌ శంకర్‌ చేయబోతున్న సినిమా ఈ ఏడాది చివర్లోనే పట్టాలెక్కే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి.

కాని ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్‌డేట్‌ ను కూడా ఇవ్వలేదు.మొత్తానికి పవన్ కళ్యాణ్ అభిమానులు హరీష్ శంకర్ విషయంలో అసంతృప్తిగా ఉన్నారు.

పవన్ మరియు హరీష్‌ శంకర్ ల కాంబోలో గబ్బర్ సింగ్ వచ్చిన విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న సినిమా కూడా గబ్బర్ సింగ్‌ తరహా లో అభిమానులు పదేళ్లు గుర్తుంచుకునేలా ఉంటుంది అనేది టాక్.

భారీ ఎత్తున అంచనాల నడుమ రూపొందుతున్న భీమ్లా నాయక్ సినిమా లో కూడా పవన్ పోలీస్ గా కనిపించబోతున్నాడు.హరీష్ శంకర్ మూవీలో కూడా మళ్లీ పోలీసుగానే కనిపించబోతున్నట్లుగా చెబుతున్నారు.

Telugu Bheemla Nayak, Gabbar, Gabbar Singh, Harish Shankar, Pawan, Pawan Fans, P

ఇది మరో గబ్బర్‌ సింగ్ అంటున్నారు.సినిమ పై చాలా అంచనాలు ఉన్నాయి.కాని సినిమా ఫస్ట్ లుక్ లేదా కాన్సెప్ట్‌ పోస్టర్ మోషన్ పోస్టర్ ఏదో ఒకటి నిన్న పవన్‌ బర్త్‌ డే సందర్బంగా విడుదల చేసి ఉంటే బాగుండేది అంటూ కామెంట్స్ వినిస్తున్నాయి.ప్రస్తుతం సినిమా కోసం సెట్స్ వేయిస్తున్న హరీష్‌ శంకర్ త్వరలోనే సినిమా ను పట్టాలెక్కించేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube