పవన్‌ ఫ్యాన్స్‌ తల్చుకుంటే ఏమైనా చేయగలరు తెలుసా?

పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ మరోసారి సత్తా చాటారు.సోషల్‌ మీడియాలో పవన్‌కు తిరుగు లేదు.

 Pawan Kalyan Fans Can Do Anything About Vakil Sahebh First Look-TeluguStop.com

పవన్‌ ఫ్యాన్స్‌కు ఎదురు లేదు అంటూ మొదటి నుండే ఒక టాక్‌ ఉంది.ఇప్పుడు అదే నిజం అయ్యింది.

ముఖ్యంగా ట్విట్టర్‌లో పవన్‌ కళ్యాణ్‌ వకీల్‌ సాబ్‌ ఫస్ట్‌లుక్‌ను ట్రెండ్‌ చేయాలని అభిమానులు మొదటి నుండి చాలా గట్టిగా ప్రయత్నించారు.అనుకున్నట్లుగానే మామూలుగా కాదు ప్రపంచ స్థాయిలో ట్రెండ్‌ అయ్యేలా చేశారు.

సౌత్‌ సినిమాలు వరల్డ్‌ వైడ్‌లో ట్రెండ్‌ అవ్వడం చాలా అరుదుగా జరుగుతుంది.

Telugu Pawan Kalyan, Pawankalyan, Vakil Sahebh, Vakilsahebh-Movie

ట్విట్టర్‌ ట్రెండ్స్‌లో వరల్డ్‌ వైడ్‌లో టాప్‌లో ట్రెండ్‌ అయిన వకీల్‌ సాబ్‌ మొత్తంగా 35 లక్షల హ్యాష్‌ ట్యాగ్‌ పోస్ట్‌లను దక్కించుకున్నట్లుగా సమాచారం అందుతోంది.ఒక సౌత్‌ సినిమాకు ఇంత తక్కువ సమయంలో ఇంత భారీ హ్యాష్‌ ట్యాగ్‌ పోస్ట్‌లు అంటే మామూలు విషయం కాదు.పవన్‌ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్‌ ఏంటో ఈ నెంబర్‌ చూస్తుంటే అర్థం అవుతుంది.

అద్బుతమైన ఈ ఫాలోయింగ్‌ ముందు ఇతర హీరోలు ఎవరు కూడా నిలవలేక పోయారు.

Telugu Pawan Kalyan, Pawankalyan, Vakil Sahebh, Vakilsahebh-Movie

పవన్‌ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో చేసిన సందడి కంటిన్యూ అవుతూనే ఉంది.వకీల్‌ సాబ్‌ చిత్రం స్థాయిని పెంచిన పవన్‌ ఫ్యాన్స్‌ ఇప్పుడు ఆ సినిమా రేటును ఏకంగా 150 కోట్లకు పెంచినట్లుగా సమాచారం అందుతోంది.పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ తల్చుకుంటే ఏదైనా సాధ్యమే అని దీంతో మరోసారి నిరూపితం అయ్యిందని యూనిట్‌ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఒక మెసేజ్‌ ఓరియంటెడ్‌ చిత్రానికి కూడా ఈ స్థాయిలో పబ్లిసిటీ కేవలం పవన్‌కే చెల్లింది అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube