ఆలీపై మండిపడిపోతున్న జనసైనికులు ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సినీ కమెడియన్ ఆలీ ఎంత మంచి స్నేహితులో అందరికీ తెలుసు.పవన్ ఏ సినిమాలో నటించినా, అందులో తప్పనిసరిగా ఆలీ పాత్ర కూడా ఉంటుంది.

 Pawan Kalyan, Janaesna, Ali, Pawan Fans Angry On Ali, Politics, Pawan Kalyan Bir-TeluguStop.com

ఆలీ లేకుండా పవన్ సినిమాలు చాలా అరుదుగా మాత్రమే ఉన్నాయి.సినిమాల్లో వీరిద్దరి కాంబినేషన్ అందరిని ఆకట్టుకుంటుంది.కాకపోతే జనసేన పార్టీ స్థాపించిన తర్వాత పవన్ వెంట ఆలీ నడవకపోవడం, పవన్ కు రాజకీయ బద్ధ శత్రువు గా ఉన్న వైసీపీలో చేరడంతో వీరి ఫ్రెండ్షిప్ కి బీటలు పడ్డాయి.2019 ఎన్నికల సమయంలో వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారానికి దిగిన ఆలీ పై పవన్ సీరియస్ గానే విమర్శలు చేశారు.దానికి కౌంటర్ గా ఆలీ కూడా కౌంటర్లు వేశారు.ఇక అప్పటి నుంచి వారి మధ్య స్నేహం కూడా కట్ అయింది అనే అభిప్రాయానికి అందరూ వచ్చేశారు.

వీరిద్దరూ అప్పటి నుంచి రాజకీయ బద్ధ శత్రువులు గానే ఉంటూ వస్తున్నారు.ఇక ఎన్నికలు ముగిసి ఏడాదికి పైగా అయ్యింది .ఇక వీరిద్దరి మధ్య ఎటువంటి విమర్శలు, ప్రతి విమర్శలు లేవు.ఇదిలా ఉంటే సెప్టెంబర్ రెండో తేదీన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ హడావుడి చేసిన సంగతి తెలిసిందే.

దీనికి సంబంధించి ఈ నెల 13వ తేదీన సోషల్ మీడియాలో పవన్ పుట్టినరోజు వేడుకల పేరుతో యాష్ టాగ్ పెట్టి మరి శుభాకాంక్షలు చెబుతూ, హడావుడి చేశారు.ఇది బాగా వైరల్ అవడంతో, కమెడియన్ ఆలీ కూడా సోషల్ మీడియా ట్రెండ్ లో పాల్గొన్నారు.

Telugu Janaesna, Pawanfans, Pawan Kalyan, Pawankalyan-Telugu Political News

ఈ సందర్భంగా అనేక ప్రశంసలు కురిపిస్తూ “వ్యక్తిత్వంలో నిన్ను ఓడించలేనప్పుడే నీ కులం, వర్ణం గురించి మాట్లాడతారు.ఎవరు ఎన్ని విధాలుగా విమర్శించినా, చెదరని నీ నవ్వుకి, మీ సహనానికి శిరస్సు వంచి నమస్కారాలు పవన్ కళ్యాణ్ ” అంటూ ఆలీ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.ఇంత వరకు బాగానే ఉన్నా, ఆలీ పవన్ పై ఇంత ప్రేమ కురిపించడం జనసైనికులకు తీవ్రంగా ఆగ్రహం కలిగిస్తోంది.గతంలో రాజకీయ అంశాలకు దీనిని మూడు పెట్టి గట్టిగా ట్రోల్ చేస్తున్నారు.

నీ స్నేహితుడుపై అప్పట్లో విమర్శిస్తూ, కామెంట్లు చేశావని, కానీ ఇప్పుడు ఈ ప్రశంసలు ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు.

రాజకీయ అంశాలకు ముడిపెట్టి అనేక ప్రశ్నలు వేస్తూ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉండడంతో, ఆలీ ఫ్యాన్స్ కూడా అదే స్థాయిలో ప్రతి విమర్శలు చేస్తున్నారు.

రాజకీయాలు వేరు, వ్యక్తిగత జీవితం వేరు అని, దానికి దీనికి ముడిపెట్టడం సరికాదని కౌంటర్ ఇస్తున్నారు.ఆలీ కామెంట్స్ పై పవన్ స్పందన ఏంటి అనేది తెలియకపోయినా, పవన్ కు ఆలీ శుభాకాంక్షలు చెప్పడంపై మండిపడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube