పవన్ ఆ విషయంలో మారి తీరాల్సిందేనా ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన బలం బలగం అంతా అభిమానులే.పవన్ ప్రసంగాలు వింటే వారంతా పూనకం వచ్చినట్టు ఊగిపోతుంటారు.

 Pawan Kalyan Fans And Workerswant Changepawan Speechway-TeluguStop.com

ఇక పొలిటికల్ ప్రసంగాలకైతే చెప్పలేనంత రెస్పాన్స్ వస్తుంటుంది.అంత వాగ్ధాటి ఉన్నారాజకీయంగా పవన్ కు ఎదురుదెబ్బలే మిగిలాయి.

ప్రస్తుతం 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పవన్ ఇప్పటి నుంచే పార్టీని పటిష్టం చేసే పనిలో పడ్డాడు.తమ పార్టీ నేతలు, అభిమానులతో సమావేశాలు నిర్వహిస్తూ జనసేన క్రేజ్ పెంచే ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఇంతవరకు బాగానే ఉన్నాప్రస్తుతం పవన్ రాజకీయ ప్రసంగాలు అభిమానులతో పాటు ప్రజలకు బోర్ కొట్టిస్తున్నట్టు కనిపిస్తోంది.వాస్తవానికి పవన్ సినిమాల్లో ఉన్నంతకాలం స్టేజ్ ఎక్కాలంటే బాగా ఇబ్బందిపడిపోతుండేవాడు.

కొన్ని సినిమా ఫంక్షన్లలో అభిమానులు నాలుగైదు గంటల పాటు ఆయన కోసం ఎదురు చూస్తే ఆయన చివర్లో నాలుగైదు నిమిషాలు ప్రసంగించి వెళ్ళిపోయే వారు.అయితే, రాజకీయాల్లోకి వచ్చే ముందు అనేక అంశాలతో పాటు తన ఉపన్యాస శైలి గురించి పవన్ బాగానే కసరత్తు చేసాడు.

-Telugu Political News

దీని కారణంగానే పవన్ పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చిన తరువాత ఆయన ఉపన్యాసాలు యూత్ ను బాగా ఆకట్టుకుంది.జనసేన పార్టీని స్థాపించిన మొదటి రోజు ఇచ్చిన స్పీచ్ కానీ, ఎన్నికలయ్యాక బిజెపిని పాచిపోయిన లడ్డూలు ఇచ్చారంటూ విమర్శించిన ఉపన్యాసం కానీ అప్పట్లో బాగా హైలెట్ అయ్యింది.ఇక వైసీపీ అధినేత జగన్ విషయానికి వస్తే ఆయనకు సొంతంగా మీడియా ఉండి కూడా మూడేళ్ల పాటు టీడీపీ ప్రభుత్వం మీద చేయలేనటువంటి ఎదురుదాడిని పవన్ తన ఒక్క ప్రసంగంతో చేసి టీడీపీ అధినేతను డైలమాలో పడేసాడు.కానీ ఇప్పుడు పవన్ ప్రసంగాలు ఆ రేంజ్ లో ఉండకపోవడం అభిమానులను నిరాశపరుస్తోంది.

ఇటీవలి కాలంలో ఆయన భీమవరంలో పర్యటించినప్పుడు ఆయన ఉపన్యాసాలు విన్న అభిమానులు పవన్ కళ్యాణ్ ఉపన్యాసాలలో కొన్ని మార్పులు అవసరమని అభిప్రాయపడ్డారు.పవన్ కళ్యాణ్ ఉపన్యాసంలో ఎక్కువ భాగం అనవసర విషయాలే ఉంటున్నాయి తప్ప పార్టీకి కలిసివచ్చే అంశాలేవీ ఉండడంలేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

-Telugu Political News

రాజకీయాల్లో తానొక్కడినే నిజాయితీపరుడునని చెప్పుకుంటూ, ఇతర పార్టీలు తన మీద కక్షగట్టాయని సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నాడు.అదీ కాకుండా ప్రజారాజ్యం పార్టీ సమయంలో కొంతమంది నాయకులు అలా వ్యవహరించారు ఇలా వ్యవహరించారు అని సింపతి పొందే ప్రయత్నం చేస్తున్నారు.తన మంచితనం గురించి, తన కుటుంబం మంచితనం గురించి, తమ మీద జరుగుతున్న దాడుల గురించి ఎక్కువ సేపు చెబుతూ ఉండడం వల్ల, ప్రత్యేకంగా కలిగే ప్రయోజనం ఏమీ ఉండదు.ఉదాహరణకు, మొన్నటి భీమవరం పర్యటనలో పవన్ మాట్లాడుతూ ఇటీవల తాను ఒక వాచ్ ఎక్కడో మర్చిపోతే, ఒక అభిమాని దాన్ని తన వద్దకు చేర్చడం ఒకవేళ తాను వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసి ఉంటే అతను అలా చేసి ఉండేవాడు కాదు అంటూ వ్యాఖ్యానించాడు.

దీనికి బదులుగా ప్రజల సమస్యలు, స్థానిక సమస్యలు మీద మాట్లాడితే ప్రజల నుంచి మంచి మద్దతు లభిస్తుందని జనసేన నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube