స్టార్ హీరోలను అభిమానించే అభిమానులు తమ ఫేవరెట్ హీరోలపై అభిమాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చాటుకుంటారనే సంగతి తెలిసిందే.ఫేవరెట్ హీరోలపై అభిమానంతో హీరో పుట్టినరోజున కొంతమంది ఫ్యాన్స్ రక్తదానం, అన్నదానం చేస్తే మరి కొందరు ఫ్యాన్స్ మాత్రం ఫ్లెక్సీల ద్వారా తమకు ఇష్టమైన హీరోలపై అభిమానాన్ని చాటుకోవడం జరుగుతుంది.
తాజాగా పవన్ ఫ్యాన్ ఒకరు తన కొడుకుకు జనసేన( Jana sena ) అని పేరు పెట్టారు.
ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా( Social media )లో వైరల్ అవుతుండగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చేసిన చేసిన పని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
కర్నూలు జిల్లాకు చెందిన హనుమంతు పెళ్లికి ముందే కొడుకు పుడితే ఆ కొడుకుకు జనసేన అని పేరు పెడతానని దేవుడిని మొక్కుకున్నాడట.పెళ్లైన తర్వాత కొడుకు పుట్టడంతో మొక్కు తీర్చుకోవాలని పుట్టిన ఇద్దరు మగ కవలలలో ఒకరికి జనసేన అని పేరు పెట్టడం జరిగింది.

పవన్ అభిమాని చేసిన ఈ పని సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతుండగా పవన్ ఫ్యాన్ నిర్ణయాన్ని కొంతమంది ప్రశంసిస్తుండగా మరి కొందరు మాత్రం నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.బాల్యం నుంచి నాకు పవన్ కళ్యాణ్( Pawan klayan ) అంటే ఇష్టం, అభిమానమని ఆ అభిమానాన్ని ఈ విధంగా చాటుకున్నానని హనుమంతు వెల్లడించారు.ఆస్పరి మండలం హాలిగేర గ్రామానికి చెందిన హనుమంతు తన కొడుకుకు పెట్టిన పేరు ద్వారా వార్తల్లో నిలిచారు.

పవన్ కళ్యాణ్ కు కెరీర్ పరంగా మరింత కలిసిరావాలని బ్రో సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయాలని పవన్ అభిమానులు కోరుకుంటున్నారు.పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ భారీ రేంజ్ లో ఉండగా బ్రో సినిమా పవన్ కోరుకున్న సక్సెస్ ను అందిస్తుందేమో చూడాలి.పవన్ పారితోషికం రోజుకు 2 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.