Pawan Kalyan Fallow NTR Political Steps

రాజకీయాల్లో సినిమావాళ్ళ హావా ఎప్పటినుండో కొనసాగుతోంది.సినిమా కి రాజకీయానికి-రాజకీయానికి సినిమాకి ఎంతో దగ్గర సంభందం ఉంది.

 Pawan Kalyan Fallow Ntr Political Steps-TeluguStop.com

అన్నగారు చెప్పే డైలాగులు ప్రజలలో అప్పట్లో తీవ్రమైన ప్రభావాన్నే చూపాయి.సినిమా వాళ్ళకేమి తెలుసు రంగులేసుకోవడం తప్ప అని అనుకున్న వాళ్ళ నోళ్ళు ముసేలా చేసారు ఎన్టీఆర్.

పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు అదే బాటలో నడవబోతున్నారు.ప్రజలని తన వైపు తిప్పుకునేలా వ్యుహరచనలు చేస్తున్నట్టుగా టాక్.2014లో జ‌న‌సేన పార్టీ పెట్టినా.అప్ప‌టి రాజ‌కీయ స‌మీక‌ర‌ణల నేప‌థ్యంలో ఆయ‌న కేవ‌లం బీజేపీ-టీడీపీల‌కు ప్ర‌చారానికి పరిమితం అయ్యాడు

వచ్చే ఎన్నికల్లో తన సత్తా చాటనున్నాడు.

సాధారణంగా కొత్త పార్టీ ఎవరన్నా పెడితే వారు వలసలతో ఆ పార్టీలో సంఖ్యలని పెంచుకుంటారు.ఇలా పక్క పార్టీ నుంచీ వలసలని ఆమోదించి చిరంజీవి పెద్ద తప్పు చేశారు.

అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు పెద్ద తేడా ఏమి లేదు అంటూ అసహనం వ్యక్తం చేశారు.కానీ, ప‌వ‌న్ దీనికి విరుద్ధంగా అడుగులు వేస్తున్నాడు.ఇప్ప‌టి వ‌ర‌కు ఏ పార్టీ అసంతృప్తుల‌ను ఆయ‌న చేర‌దీయ‌లేదు.పిలుపు కూడా ఇవ్వ‌లేదు

ఓ వ్యూహంతో అడుగులు వేస్తున్న ప‌వ‌న్ .త‌న‌కే కాదు, త‌న పార్టీకి కూడా నూతన పంథానే నేర్పుతున్నాడు.గెలిచినా ఓడినా పవన్ తానూ నమ్మిన సిద్దాంతానికి కట్టుబడి ఉన్నాడని తెలుస్తోంది

ఈ సమయంలోనే పవన్ ఇప్పుడు తెలుగుదేశం వ్యవస్థాపకుడు అన్న ఎన్టీఆర్ ని ఫాలో అవుతున్నాడు అని తెలుస్తోంది.

అప్ప‌ట్లో మ ఎన్టీఆర్ రాజ‌కీయాల్లోకి రావాల‌ని నిర్ణ‌యించుకుని అందుకు అనుగుణంగా బొబ్బిలి పులి వంటి మూవీని ఎంచుకున్నారు.అందులో పేల్చిన రాజ‌కీయ డైలాగులు ప్ర‌జ‌ల్లో చిర‌స్థాయిగా నిలిచిపోయాయి.

ఇప్పుడు ఇదే మార్గంలో పొలిటిక‌ల్ మూవీ ఒక‌టి చేయాల‌ని ప‌వ‌న్ త‌పిస్తున్న‌ట్టు టాలీవుడ్ స‌మాచారం.కానీ ఈ విషయంలో చిరంజీవి మాత్రం ఫ్లాప్ అయ్యాడు.

పొలిటికల్ ఎంట్రీ ముందు ఒక కామెడి సినిమాతో వచ్చాడు సినిమా ఆడలేదు.చిరు రాజకీయం కూడా నడవలేదు

ఇప్పుడు అదే తప్పు పవన్ చేయాలని అనుకోవడం లేదు.

పొలిటికల్ “బ్యాక్ డ్రాప్” లో ఒక మూవీ కి ప్లాన్ చేస్తున్నాడు.ఈ సినిమాలో పంచ్‌లు పేల్చి ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని ప్లాన్ చేస్తున్నాడు.

అందుకు అనుగుణంగానే క్రిష్ లాంటి దర్శకుడిని ఎంచుకున్నాడు.ఇప్పటికే క్రిష్ చెప్పిన కధ తనకి నచ్చడంతో.

మూడు నెలల కాలంలోనే ఈ సినిమా పూర్తీ చేయాలని క్రిష్ కి చెప్పినట్టు సమాచారం.మరి పవన్ వేసిన ఈ ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందా ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడిచి సక్సెస్ అవుతాడో లేదా అనేది కాలమే నిర్ణయించాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube