ఆర్థిక ఇబ్బందులు అంటూనే ఈ దానాలు ఏంటి పవన్ అంటున్న ఫ్యాన్స్‌

పవన్ కళ్యాణ్‌ కు రాజకీయం అంటే ప్రాణం.జనాలకు సేవ చేయడం అంటే అంతకు మించి ఇష్టం అనడంలో సందేహం లేదు.

 Pawan Kalyan Again Donate A Big Amount For Temple  , Pawan Kalyan, Ramalayam Tem-TeluguStop.com

సినిమాలపై పెద్దగా ఆసక్తి లేదు అంటూ గతంలో చాలా సార్లు పవన్ కళ్యాణ్ అన్నాడు.జనసేన పార్టీ ప్రారంభం సమయంలో కూడా తాను ఆర్థిక అవసరాల కోసం సినిమాలు చేయాలనుకుంటున్నాను.

అంతే తప్ప సినిమాలపై ఇష్టం లేదు అంటూ కుండ బద్దలు కొట్టేశాడు.ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని పవన్ చాలా సందర్బాల్లో అన్నాడు.

అందుకే సినిమాలు చేయాల్సి వస్తుందని పేర్కొన్నాడు.ఇక వకీల్ సాబ్‌ నుండి మొదలుకుని దాదాపుగా అయిదు సినిమాలను పవన్ ప్రారంభించాడు.

ఆ అయిదు సినిమాలు కూడా వరుసగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.వాటితో ఓ రెండు వందల కోట్లను బ్యాంకులో వేసుకునే అవకాశం ఉంది.

Telugu Pawanayodhya, Pawan Fans, Pawan Janasena, Pawan Kalyan, Pawankalyan, Pawa

వందల కోట్లు పవన్‌ చేతిలో ఉంటాయి కదా అనుకుంటే పొరపాటే.ఈ రోజు ఉన్న డబ్బు రేపు ఉండదు.ఆయనకు వరుసగా ఏవో ఒక అవసరాలు వస్తూనే ఉంటాయి.అవసరం అంటే ఆయన వ్యక్తిగత అవసరాలు కాదు.ఆయన చాలా సాయాలు చేస్తూ ఉంటాడు.ఆయన వద్దకు సాయాల కోసం ఎంతో మంది వస్తూనే ఉంటారు.

తెలిసి ఒక్క రూపాయి దానం చేస్తే తెలియకుండా ఆయన వంద రూపాయల దానాలు చేస్తాడు అనేది టాక్‌.ఆర్థిక అవసరాలు ఎంతో ఉన్నా కూడా సాయం ముందు అంటాడు.తాజాగా ఈయన రామ మందిర నిర్మాణం కోసం అయోధ్య ట్రస్ట్ కు ఏకంగా రూ.30 లక్షల విరాళంను ప్రకటించాడు.దేవాలయం నిర్మాణంకు అంత ఖర్చు ను కేంద్రం భరించే అవకాశం ఉంది.కాని అందరిని భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశ్యంతో విరాళాలు సేకరిస్తున్నారు.అంతే తప్ప లక్షలు ఏమీ అవసరం లేదు.పవన్‌ అయినా కూడా ఏకంగా 30 లక్షలు ఇచ్చాడు.

ఆర్థిక ఇబ్బందులు అంటూ వ్యాఖ్యలు చేసే పవన్ ఇలా విరాళాలు ఇవ్వడం అవసరమా అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube