రెండు కోట్లు దానం చేసిన పవర్ స్టార్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెర మీద మనల్ని నవ్వించటానికి ఎంత అల్లరి చేస్తాడో, బయట దానికి భిన్నంగా, సాదాసీదాగా ఉండే మనిషి.కష్టాల్లో ఉన్న చాలామందిని గుప్తదానాలతో అయన ఆదుకున్నారని చెబుతూ ఉంటారు.

 Pawan Kalyan Donates 2 Crore For Chennai Floods-TeluguStop.com

అందుకే హీరో పవన్ కళ్యాణ్ కన్నా వ్యక్తిగా పవన్ కి అభిమానులు ఎక్కువ అనటంలో ఏమత్రం అతిశయోక్తి లేదు.

మరోసారి తన వ్యక్తిత్వాన్ని నిరూపించుకున్నారు పవన్ కళ్యాణ్.

ఇన్నిరోజులుగా చెన్నైలో అంతలా జనం అల్లాడిపోతోంటే పవన్ సైలెంట్ గా ఉన్నాడని విమర్శించిన వారికి గట్టిగా బదులిచ్చాడు పవన్.

సినివర్గాల సమాచారం మేరకు పవన్ చెన్నై వరద బాధితుల సహాయార్ధం ఏకంగా రెండు కోట్లు దానం చేసాడు.

ఇదే విషయాన్ని రామ్ గోపాల్ వర్మ కూడా ప్రకటించారు.

చెన్నై వరద భాధితుల కోసం అల్లు అర్జున్ 25 లక్షలు, ప్రభాస్ 15 లక్షలు, మహేష్ బాబు 10 లక్షలు, ఎన్టీఆర్ 10 లక్షలు, రవితేజ 5 లక్షలు, వరుణ్ తేజ్ 3 లక్షలు విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube