రిలాక్స్ అయిన పవన్ కళ్యాణ్! వెంకటేశ్వర స్వామికి భారీ విరాళం  

గుంటూరులో దశావతార వెంకటేశ్వర ఆలయంకి భారీ విరాళం ఇచ్చిన జనసేనాని. .

Pawan Kalyan Donate One Crore Above Money To Temple-one Crore Above Money To Temple,pawan Kalyan Donate,tdp,ysrcp

ఏపీలో ఎన్నికల హడావిడి ముగిసిపోయింది. ఫలితం రావడానికి మరో నెల రోజులు పడుతుంది. ఇక ఎన్నికల తర్వాత అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే..

రిలాక్స్ అయిన పవన్ కళ్యాణ్! వెంకటేశ్వర స్వామికి భారీ విరాళం-Pawan Kalyan Donate One Crore Above Money To Temple

అదే సమయంలో ఎవరికీ వారు తాము గెలుస్తామంటే, తాము గెలుస్తాం అంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే మూడో ప్రత్యామ్నాయంగా ఉన్న జనసేన పార్టీ అధినేత మాత్రం ఎన్నికల తర్వాత అధికార, ప్రతిపక్షాల తరహాలో గొప్పలు చెప్పుకోవడం, విమర్శలు చేయడం చేయకుండా ప్రశాంతంగా ఉన్నట్లు తెలుస్తుంది.

దీనికి నిదర్శనంగా ఇన్ని రోజులు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న జనసేనాని ఎన్నికల అనంతరం గుంటూరు పెదకాకాని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న దశావతార వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

ఇక అక్కడ దర్శనం అనంతరం అన్నదాన సత్రంకి వెళ్లి భక్తులకి భోజనాలు వడ్డించారు. అనంతరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 1.32 కోట్ల ఆలయంలో నిత్యాన్నదానం కోసం విరాళమిచ్చారు. ఆలయంలో జరిగే నిత్యాన్నదానానికి ఆ కోట్ల రూపాయల ధనంను ఉపయోగించవలసిందిగా కోరుతూ ఆలయ ధర్మకర్తలకు చెక్కును అందజేశారు. మొత్తానికి ప్రజలు ఇచ్చే ఫలితం ఎలాంటిది అయిన తాను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా అని పవన్ కళ్యాణ్ తన పద్దతులతో తెలియ్జేసాడని స్పష్టం అవుతుంది.