పవన్‌తో కాదు కాని మెగా హీరోతో కన్ఫర్మ్‌ అయ్యిందా?

పవన్‌ కళ్యాణ్‌తో ఇప్పటి వరకు గోపాల గోపాల మరియు కాటమరాయుడు చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు డాలీ మరో సినిమాను చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.కథ వినిపించాడు, షూటింగ్‌ కూడా వచ్చే ఏడాదిలో ప్రారంభం అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరిగింది.

 Dollyto Direct Mega Young Hero, Pawan Kalyan, Gopala Gopala, Katamarayudu, Direc-TeluguStop.com

కాని తాజాగా దర్శకుడు డాలీ మాట్లాడుతూ పవన్‌తో మూవీ విషయం నిజం కాదని క్లారిటీ ఇచ్చాడు.అసు ఇప్పటి వరకు పవన్‌కు ఎలాంటి కథను వినిపించలేదు అన్నాడు.

దర్శకుడు డాలీ కాటమ రాయుడు చిత్రం తర్వాత తదుపరి చిత్రాన్ని ఇప్పటి వరకు మొదలు పెట్టలేదు.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈయన తన తదుపరి చిత్రాన్ని మెగా హీరోతో చేసేందుకు రెడీ అవుతున్నాడట.

పవన్‌ కళ్యాణ్‌ కాకుండా ఆ మెగా హీరో ఎవరై ఉంటారో అనే విషయాన్ని మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు.డాలీ ఇప్పటికే స్క్రిప్ట్‌ రెడీ చేశాడు.ఆ మెగా యంగ్‌ హీరో చేస్తున్న సినిమాలు పూర్తి అయిన తర్వాత డాలీ దర్శకత్వంలో సినిమాకు డేట్లు ఇవ్వబోతున్నాడట.

Telugu Dollytodirect, Gopala Gopala, Katamarayudu, Kishorekumar, Pawan Kalyan-

అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఆ మెగా యంగ్‌ హీరోతో దర్శకుడు డాలీ వచ్చే ఏడాది చివరి వరకు ఒక సినిమాను మొదలు పెట్టే అవకాశం ఉందంటున్నారు.అతి త్వరలోనే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ను కూడా దర్శకుడు డాలీ మొదలు పెట్టబోతున్నాడు.మెగా హీరోకు బాగా నచ్చిన స్క్రిప్ట్‌ అవ్వడంతో నటించేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నాడంటూ చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube