పవన్ సినిమాను పక్కనబెట్టిన దిల్ రాజు!  

Pawan Kalyan Dil Raju Vakeel Saab - Telugu Dil Raju, Pawan Kalyan, Vakeel Saab, Venu Shriram

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ కోసం ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో పవర్ స్టార్ మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.

 Pawan Kalyan Dil Raju Vakeel Saab

బాలీవుడ్‌లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘పింక్’కు రీమేక్‌గా ఈ సినిమా వస్తుండటంతో వకీల్ సాబ్‌పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.కాగా ఈ సినిమా షూటింగ్ మెజారిటీ శాతం ఇప్పటికే పూర్తయిన సంగతి తెలిసిందే.

అయితే ప్రస్తుతం నెలకొన్న లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.కాగా కొంతమేర మిగిలి ఉన్న సినిమా షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.

పవన్ సినిమాను పక్కనబెట్టిన దిల్ రాజు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అన్ని సినిమాలకంటే ముందు ఈ సినిమానే షూటింగ్ ప్రారంభిస్తుందని అందరూ అనుకున్నారు.కానీ ఈ సినిమాను ఇప్పట్లో ప్రారంభించాలని చూడట్లేదట చిత్ర నిర్మాత దిల్ రాజు.దీనికి బలమైన కారణం కూడా ఉందని ఆయన అంటున్నారు.

ప్రస్తుతం సినిమా థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో చెప్పలేని పరిస్థితి నెలకొనడంతో, ఈ సినిమాను హడావిడిగా పూర్తి చేసినా ప్రయోజనం ఉండదని దిల్ రాజు భావిస్తు్న్నాడు.

ఇక ఈ సినిమాలో పవన్ లాయర్ పాత్రలో నటిస్తుండగా నివేదా థామస్, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు.వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test