పవన్ రైతు ధర్నా ? వేడెక్కనున్న ఏపీ పాలిటిక్స్ 

ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచే పనిలో పడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.ఒక పక్క సినిమా షూటింగ్ లలో పాల్గొంటూనే, మరోవైపు రాజకీయంగానూ యాక్టివ్ గా ఉంటూ, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నిస్తున్నారు.

 Pawan Kalyan Is Going To Hold A Dharna For The Farmers, Janasena Leaders, Dharna-TeluguStop.com

త్వరలోనే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలు ఉండడం, అలాగే స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి, ఆ తర్వాత జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉండడం, ఇలా ఎన్నో కారణాలతో పవన్ యాక్టివ్ అయినట్లుగా కనిపిస్తున్నారు.ఒకపక్క తమ మిత్రపక్షమైన బీజేపీ తో సంబంధం లేనట్టుగానే సొంతంగా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ పవన్ హడావుడి చేస్తుండటం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇది ఇలా ఉంటే కొద్ది రోజుల క్రితం నివార్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలి అంటూ కొన్ని జిల్లాల్లో పవన్ పర్యటించారు.పెద్ద ఎత్తున ప్రభుత్వంపై విమర్శలు చేసారు.

ఇప్పుడు మరింతగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు పవన్ డిసైడ్ అయిపోయారు.దీనిలో భాగంగానే అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు ధర్నా చేయాలని నిర్ణయించుకున్నారు.ఈనెల 28 న అన్ని జిల్లా ల కలెక్టరేట్ల ఎదుట జనసేన నాయకులు ధర్నా చేసేందుకు సిద్ధమవుతున్నారు.అలాగే కలెక్టర్లకు వినతి పత్రాలు కూడా ఇచ్చి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు నిర్ణయించారు.

ఈ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం హాజరు కాబోతున్నారు.కృష్ణాజిల్లా కలెక్టరేట్ ఉన్న మచిలీపట్నం లో నిర్వహించే ధర్నా కార్యక్రమంలో పవన్ స్వయంగా పాల్గొనబోతున్నారు.

Telugu Colectrarete, Dharnabee, Farmers, Janasena, Janasenani, Machilipatnam, Ma

తరువాత కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చేందుకు ప్లాన్ చేసుకున్నారు.దీంతో అప్పుడే జనసేన లో సందడి వాతావరణం మొదలైంది.పవన్ 2019 ఎన్నికలు ముగిసిన తర్వాత పెద్దగా జనాల్లోకి రాలేదు.కానీ ఇప్పుడు వరుసగా ప్రజా పోరాటాలు చేపడుతూ, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.నివార్ తుఫాన్ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని, 30 వేలు పరిహారం ఇస్తేనే రైతులు ధైర్యంగా ఉంటారని, తక్షణ సహాయం కింద పది వేలు ఇవ్వాలంటూ జనసేన తరపున పవన్ డిమాండ్ చేస్తున్నారు.ఇప్పుడు ధర్నా కార్యక్రమం నిర్వహించేందుకు ప్లాన్ చేసుకున్నారు.

దీనిపై పవన్ స్పందన ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపై చర్చ జరుగుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube