మహేష్ తో శతృత్వంపై స్పందించిన పవన్ కళ్యాణ్

ఆ హీరో ఈ హీరో బాగానే ఉంటారండి .మధ్యలో ఫ్యాన్సే కొట్టుకు చచ్చేది.

 Pawan Kalyan Denies Rivalry With Mahesh Babu-TeluguStop.com

ఎవరి రికార్డులు ఎక్కువ, ఎవరి రికార్డులు తక్కువ, ఎవరి ట్రైలర్ కి ఎన్ని వ్యూస్ వచ్చాయి .ఇలా కొట్టుకోవడానికి అభిమానులకి ఎదోక రీజన్ కావాలి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు .ఇద్దరు ఇద్దరే.బాక్సాఫీస్ దగ్గర అడుగుపెట్టారంటే కలెక్షన్ల మోత మోగాల్సిందే.వీరిద్దరు ఒకరి రికార్డులను మరొకరు బద్దలు కొడుతూ ఉంటారు కాబట్టే వీళ్ళ అభిమానులు గొడవపడుతూ ఉంటారు.మరి వీరిద్దరి మధ్య కూడా ఏదైనా గొడవ ఉందా?

ఇదే ప్రశ్న పవర్ స్టార్ ని రాజీవ్ మసంద్ అడిగితే, మహేష్ కి తాను అర్జున్ పైరసి సమయంలో సహాయం చేశానని, అలాగే మహేష్ తన సినిమా జల్సాకి వాయిస్ ఓవర్ ఇచ్చాడని, తమిద్దరి మధ్య అసలు ఎలాంటి గొడవలు కాని, శతృత్వం కాని లేదని తేల్చి చెప్పేశాడు పవర్ స్టార్.

వింటున్నారా సూపర్ స్టార్ ఆండ్ పవర్ స్టార్ ఫ్యాన్స్ ? వాళ్ళకి లేని గొడవలు, శతృత్వం మీ మధ్య ఎందుకు?

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube