జనసేనాని ఢిల్లీ టూర్ వెనుక అంత ఉందా! వైసీపీ నేతల్లో డైలామా  

Pawan Kalyan Delhi Tour Secret-bjp,delhi Tour Secret,janasena,pawan Kalyan,ysrcp

ఏపీ రాజకీయాలో మూడో ప్రత్యామ్నాయంగా ఎమర్జింగ్ అవుతున్న పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం చాలా ఆసక్తికరంగా సాగుతుంది.ఓ వైపు అధికార పార్టీ జనసేనని టీడీపీ తోక పార్టీగా అభివర్ణిస్తూ విమర్శలు చేస్తుంది.

Pawan Kalyan Delhi Tour Secret-bjp,delhi Tour Secret,janasena,pawan Kalyan,ysrcp తాజా తెలుగు ఆంధ్ర ,తెలంగాణ రాజకీయ పొలిటికల్ బ్రేకింగ్ వార్తలు ..ఎలక్షన్ రిజల్ట్స్ విశ్లేషణలు ,రాజకీయ నాయకుల వివరాలు ..క-Pawan Kalyan Delhi Tour Secret-Bjp Delhi Secret Janasena Pawan Ysrcp

అదే సమయంలో తెలుగుదేశం పార్టీ నేతలు కూడా జనసేన పార్టీ తమతోనే ఉంది అన్నట్లు ప్రజల్లోకి పరోక్షంగా సంకేతాలు పంపిస్తూ వెళ్తున్నారు.ఇక ఈ రెండు ప్రధాన పార్టీలు ఆడుతున్న పొలిటికల్ డ్రామాలో పవన్ కళ్యాణ్ పావుగా మారిపోయారు.

తన సొంత బలంగా, ప్రజల మధ్య తిరుగుతూ ఎదిగే ప్రయత్నం చేస్తున్న వీళ్ళు మాత్రం ఆ అవకాశం పవన్ కళ్యాణ్ కి ఇవ్వకూడదు అన్నట్లు వ్యవహరిస్తున్నారు.ఇక రాజధాని ఇష్యూలో కూడా పవన్ కళ్యాణ్ కి ఈ ఉద్యమ క్రెడిట్ వచ్చేస్తుంది అనే భావన చంద్రబాబుకి రాగానే అతను జనాల్లోకి వచ్చి ప్రజలని మరో సారి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఊహించని విధంగా జనసేనాని ఉన్నపళంగా ఈ రోజు ఢిల్లీ ప్రయాణం అయ్యారు.పార్టీ సమావేశం జరుగుతూ ఉండగానే అతను ఢిల్లీకి బయలుదేరి వెళ్ళడం ఒక్కసారిగా రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.

నిన్న రాజధానిలో మహిళలతో మాట్లాడుతూ అమరావతి రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని చెప్పిన మరుసటి రోజే ఇలా బయలుదేరి వెళ్ళడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయా అనే అనుమానం బలపడుతుంది.ఓ వైపు అమరావతి రాజధాని ఇష్యూ, మరో వైపు స్థానిక సంస్థల ఎన్నికలలో పొత్తు విషయంపై బీజేపీ అధిష్టానంతో చర్చించడానికి పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ వెళ్ళినట్లు టాక్ వినిపిస్తుంది.

ఏది ఏమైనా రేపు ఢిల్లీ పెద్దలని పవన్ కళ్యాణ్ కలిసే అవకాశం ఉందని, తరువాత రాజధాని గురించి కేంద్రంలో బీజేపీ నేతల నుంచి ప్రకటన వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదని రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.

.

తాజా వార్తలు