వైసీపీ జనసేన మధ్య ఢిల్లీ యుద్ధం తప్పదా ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు రోజుల క్రితం ఢిల్లీ పర్యటనకు అత్యవసరంగా వెళ్లడం దాని వెనుక ఉన్న కారణాలు బయటకు తెలియకపోవడం సర్వత్ర ఉత్కంఠ రేపుతోంది.ఆయన అసలు ఢిల్లీ ఎందుకు వెళ్లారు? అక్కడ ఎవరు ఎవరిని కలిశారు ? ఎందుకు కలిశారు అనే ఉత్కంఠ అందరిలోనూ వ్యక్తమవుతోంది.తమ పర్యటన కేవలం వ్యక్తిగతమే అంటూ జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ వెల్లడించినా ఎవరికి ఆ సమాధానం సంతృప్తిని కలిగించడం లేదు.పవన్ ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా మరో ఇద్దరు కీలక నేతలను కలిశారనే వార్తలు వినిపించాయి.

 Pawan Kalyan Delhi Tour-TeluguStop.com

అయితే ఈ విషయం అస్పష్టంగా ఉండగానే పవన్ డిల్లీ పర్యటన ముగించుకుని వచ్చేశారు.

Telugu Ap Bjp, Jansenapawan, Pawan Kalyan, Tdp Chandrababu, Ysrcp-

ఇప్పుడు పవన్ పర్యటన వెనుక ఉన్న రహస్యాన్ని చేధించేందుకు వైసిపి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.పవన్ పర్యటన వెనుక ఉన్న కారణాలు తెలుసుకునేందుకు నిఘా వర్గాలను రంగంలోకి దింపినా ఇప్పటి వరకు క్లారిటీ అయితే రాలేదు.ఈ నేపథ్యంలో పవన్ ఢిల్లీ పర్యటన విషయాలను స్పష్టంగా తెలుసుకునేందుకు వైసిపి ప్రయత్నిస్తోంది.

కొంత కాలంగా ఏపీలో జనసేన వర్సెస్ వైసిపి అన్నట్టుగా మాటల యుద్ధం జరుగుతోంది.ఒకరినొకరు ఉంటూ నిత్యం ప్రెస్ మీట్ లు పెడుతూ ట్విట్టర్లో చేస్తూ విమర్శలకు దిగుతున్నారు.

Telugu Ap Bjp, Jansenapawan, Pawan Kalyan, Tdp Chandrababu, Ysrcp-

జనసేన అయితే ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు తదితర విషయాలపై వైసీపీని రాజకీయంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది.ఒకరకంగా తెలుగుదేశం పార్టీకి మేలు చేసే విధంగా పనిచేస్తుందని వైసిపి అనుమానిస్తోంది.అంతేకాదు వైసీపీ ప్రభుత్వ తీరుపై మోదీని కలిసి ఫిర్యాదు చేస్తానంటూ పవన్ ఇప్పటికే అనేకసార్లు బెదిరించారు.ఈ నేపథ్యంలోనే పవన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లాడా ? వైసీపీపై ఫిర్యాదు చేశాడా అనే విషయం తెలుసుకునే పనిలో పడింది వైసిపి.

Telugu Ap Bjp, Jansenapawan, Pawan Kalyan, Tdp Chandrababu, Ysrcp-

ఇక జనసేన విషయంలో ఉదారంగా ఉంటే రాజకీయంగా తీవ్ర ఇబ్బందులు తప్పవని అందుకే జగన్ జనసేన విషయంలో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడట.చంద్రబాబు పవన్ ఇద్దరు ఒకటేనని విషయం బాగా హైలెట్ చేసి తీసుకువెళ్లాలని చూస్తున్నాడు.ప్రస్తుతం చంద్రబాబు బిజెపి పెద్దలను కలిసే విషయంలో ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో పవన్ ను రాజకీయ దూతగా బిజెపి పెద్దల దగ్గరకు పంపించారు అనే విషయాన్ని వైసీపీ నమ్ముతోంది.అదే విషయాన్ని బాగా హైలెట్ చేసి రెండు పార్టీలను ప్రజల్లో దోషిగా నిలబెట్టాలనేది జగన్ ఆలోచనగా తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube