వారికే టిక్కెట్లు...డిసైడ్ చేసిన జనసేనాని..!!!

ఏపీలో ఎన్నికలకి ఇంకా ఐదు నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది.పోరు లో ముందు నిలిచే ప్రధాన పార్టీలు తమ వ్యూహాలతో సిద్దమయ్యారు.

 Pawan Kalyan Decides About Party Candidates In Janasena-TeluguStop.com

బహిరంగంగా ప్రకటించకపోయినా సరే ఇప్పటికే దాదాపు నియోజకవర్గాల వారిగా అభ్యర్ధుల లిస్టు సిద్దం అయ్యిపోయింది.ఎవరికి వారు ఇప్పటికే తమ తమ ప్రచారాలని చేసుకుంటున్నారు కూడా అయితే జనసేన అధినేత మాత్రం అభ్యర్ధుల విషయంలో ఎటూ తేల్చలేదు.

అసలు ఎవరికి టిక్కెట్లు ఇస్తాడో.జనసేన అధినేతకి ఎలాంటి అభ్యర్ధులు కావాలో అంటూ వార్తలు కూడా వినిపించాయి.

అయితే తాజా రాజకీయ పరిణామాల నేపధ్యంలో పవన్ తానూ టిక్కెట్లు ఇచ్చేది ఎవరికి అనే విషయంలో ఓ క్లారిటీ ఇచ్చాడు.

ఏపీ సీఎం చేస్తున్న వ్యాఖ్యలని ఖండిస్తూ తనకి ఎలాంటి అభ్యర్ధులు కావాలో, ఎవరిని ఎంపిక చేసుకుంటాడో చెప్పకనే చెప్పాడు.అయితే కేవలం రెండు కులాల ఆధారంగా విజయం సాధించలేము అంటూ తన అభిప్రాయాన్ని తెలిపాడు.అమరావతిలో జనసేన కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ సమీక్షలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జనసేన లో యూత్ లో మాంచి కిక్ ఇస్తున్నాయి.

అభిమానులకి మరింత ఉశ్చాహాన్ని అందించాయి.

అతి తక్కువ సమయంలో ఎక్కువగా ఫలితాలు ఇచ్చే సలహాలు ఇవ్వాలని పవన్ కార్యకర్తలని కోరాడు.

పవన్ అంతేకాదు వ్యక్తిగతంగా పదివేల ఓట్లు వచ్చే వారిని పార్టీ తప్పకుండ అక్కున చేర్చుకుంటుందని ఆయన తెలిపారు.ఎందుకంటే వ్యక్తిగతంగా వారికి పదివేల ఓట్లు వస్తే పార్టీ పరంగా వచ్చే ఓట్లు , కుల ప్రాతిపదికన వచ్చే ఓట్లు ఇలా అన్ని ఈక్వేషన్స్ లో వారిని విజయం వరిస్తుందనేది పవన్ ఆలోచన దాంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అలాంటి వారికోసం వెతుకులాట చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

అయితే కులాల పేరు చెప్పుకుని కొంతమంది లాభపడుతున్నారని.కుల రాజకీయాలని జనసేన పార్టీ ప్రోత్సాహం ఇవ్వదని తెలిపారు.కార్యకర్తలు ఎప్పుడూ చాలా బాధ్యత, ఓపిక, సహనం తో ఉండాలని అలా ఉంటేనే రాజకీయాల్లో రాణిస్తారని అన్నారు.ప్రజా రాజ్యం సమయంలో ఎదుర్కున్న అనుభవాలు ఇప్పుడు జనసేన నిర్మాణంలో ఉపయోగ పడుతున్నాయని అన్నారు పవన్.

అయితే తనకి ఎలాంటి వ్యక్తులు కావాలో పవన్ ఓ హింట్ ఏపీ ప్రజలకి ఇచ్చారు.మరి ఇంకేం 10 వేల ఓట్లు వచ్చే వారు ఎవరన్నా ఉంటే వచ్చేయండి అనేది ఈ మీటింగ్ సారాంశం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube