పవన్ మాట: ఆయన పై ఎఫ్‌బీఐకి కి ఫిర్యాదు చేస్తా !  

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరుస వరుసగా ఒక్కక్కరిని టార్గెట్ చేస్తూ .. విమర్శలు గుప్పిస్తున్నాడు. తాజాగా… కేవీ రావుపై అనే వ్యక్తిపై పవన్ నిప్పులు చెరిగారు. ఆయన పై ఎఫ్‌బీఐకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్… తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జీ కన్వెషన్‌ హాల్‌లో మీడియాతో మాట్లాడిన పవన్ … సాధారణ సినిమా హాల్ యజమాని అయిన కేవీరావు ఇప్పుడు అమెరికా పౌరుడు ఎలా అయ్యాడు..? కేవీ రావు పై నేను ఎఫ్‌బీఐకి ఫిర్యాదు చేస్తానన్నారు. అమెరికాలో ఉన్న కేవీరావును ఇక్కడికి రప్పించాలని డిమాండ్ చేసిన పవన్… అన్ని ప్రభుత్వశాఖలను జవాబుదారిగా నిలబెట్టాలన్నారు. లేదంటే ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్షనేత జగన్, మంత్రి లోకేష్ దీనిపై సమాధానం చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు.

Pawan Kalyan Criticizes To Kvrao-

Pawan Kalyan Criticizes To Kvrao

కాకినాడ సీ పోర్ట్స్, హోప్ ఐ లాండ్, పీడీఎస్ బియ్యం ఎగుమతులు, ఆయిల్ మాఫియా, వ్యవహారం పై జనసేన టీం సేకరించిన వీడియోను ఈ సందర్భంగా ప్రదర్శించారు పవన్ కల్యాణ్… కాకినాడ తీరంలో సహజ సిద్ధంగా ఏర్పడిన హోస్ ఐలాండ్ ను అక్రమంగా తవ్వేశారని విమర్శించారు. పర్యావరణానికి తీవ్రంగా విఘాతం కలిగిస్తుంటే ప్రభుత్వానికి పట్టదా..? ప్రతిపక్షానికి కనిపించడం లేదా..? అని మండిపడ్డారు. విశాఖలో మెలోడి థియేటర్ యజమాని కేవీరావు ఇప్పుడు వేల కోట్ల ఎలా వెనుకేసుకున్నారని పవన్ ఆరోపించారు.