అయ్య బాబోయ్ ! జగన్ ని పవన్ ఈ రేంజ్ లో తిట్టేశాడేంటి..?     2018-11-13   21:34:35  IST  Sai M

వైసీపీ అధినేత జగన్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు. ఇప్పటి వరకు ఈ రెండు పార్టీల అధినేతలో పొత్తుల కోసం ప్రయత్నిస్తున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో పవన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తనను వ్యక్తిగతంగా విమర్శించడం కాదని… అసెంబ్లీకి వెళ్లి ప్రజాసమస్యలను తూర్పారపడితే.. అప్పుడు మగతనం బయటకు వస్తుందని ఘాటుగా వ్యాఖ్యానించారు.

Pawan Kalyan Criticized To Jagan-

అసెంబ్లీకి వెళ్లకుండా తనను విమర్శించడమేంటని ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం బహిరంగ సభలో మాట్లాడిన పవన్.. అసెంబ్లీకి వెళ్లి సీఎంను నిలదీయాల్సిన బాధ్యత ప్రజలు వైసీపీకి ఇచ్చారని… కానీ ప్రతిపక్ష నాయకుడు బుగ్గలు నిమరడం తప్ప ప్రశ్నించడంలేదన్నారు. బడుగు బలహీన వర్గాలు అండగా ఉంటామన్న వైసీపీ.. రెల్లి కులస్థుల భూములను ఆ పార్టీ నేత దోచుకున్నా పట్టించుకున్న నాథుడు లేడన్నారు. ఒక ఎమ్మెల్యే, ఎంపీలేని తానే ఇన్ని ప్రజా సమస్యలకు పరిష్కారం కనుక్కుంటున్నానని.. వైసీపీ నేతలు ఏం చేస్తున్నారంటూ పవన్ నేరుగా జగన్ ని టార్గెట్ చేసుకుని విమర్శల బాణాలు వదిలారు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.