పోలవరం ఆపేయడంపై పవన్‌ కామెంట్స్‌  

Pawan Kalyan Commnets On Stop The Polavaram Project-pawan Kalyan

వైకాపా ప్రభుత్వం 100 రోజుల పాలపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ నేడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ నివేధిక విడుదల చేశాడు.ఈ సందర్బంగా పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేక పోవడంతో పాటు పలు విషయాల్లో ఇంకా ఒక నిర్ణయాన్ని తీసుకోలేక వైకాపా ప్రభుత్వం ఇబ్బందులు పడుతున్నట్లుగా పవన్‌ కళ్యాణ్‌ ఆరోపించాడు.

Pawan Kalyan Commnets On Stop The Polavaram Project-pawan Kalyan-Pawan Kalyan Commnets On Stop The Polavaram Project-Pawan

వైకాపా ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంను ఆపేసిన విషయమై కూడా పవన్‌ స్పందించాడు.

Pawan Kalyan Commnets On Stop The Polavaram Project-pawan Kalyan-Pawan Kalyan Commnets On Stop The Polavaram Project-Pawan

పోలవరం పనులు నిలిచి పోవడం ప్రభుత్వం తప్పుడు నిర్ణయం కారణం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ప్రాజెక్ట్‌ పనుల్లో అవినీతి జరిగితే విచారణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.కాని ప్రాజెక్ట్‌ పనులు నిలిపేయడం ఎంత మేరకు కరెక్ట్‌ అంటూ ప్రశ్నించాడు.రైతుల ప్రయోజనాలు పణంగా పెట్టి పోలవరంను ఆపేశారంటూ పవన్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.కృష్ణా నదికి వరదలు వచ్చిన సమయంలో వాటిని సరిగా మేనేజ్‌ చేయడం, ఆ సమయంలో ప్రజలను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందన్నాడు.

అమరావతికి తెలుగు దేశం పార్టీ గెజిట్‌ ఇవ్వలేదని విమర్శలు చేస్తున్న వైకాపా ప్రభుత్వం ఇప్పటికైనా అమరావతికి గెజిట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు.