పవన్ చెబుతున్న మార్పు సాధ్యమేనా ?

ఎన్నికల్లో పార్టీ ఓటమి, పార్టీ భవిష్యత్తు, రాబోయే రోజుల్లో ఏ ఏ అంశాల ద్వారా ప్రజల్లోకి వెళ్లాలి, ఇలా అనేక అంశాల గురించి పార్టీ నేతలు, అభిమానులతో పవన్ సభలు, సమావేశాలు పెట్టి మరీ చర్చిస్తున్నాడు.ఈ సందర్భంగా పార్టీ తీరుపై అసంతృప్తిగా ఉన్న జనసేన కార్యకర్తలకు, నాయకులకు భరోసా కల్పించే విధంగా మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో మనదే అధికారం అంటూ వారిలో ఉత్సాహం పెంచుతున్నాడు.

 Pawan Kalyan Commentsabout Janasena Workers Andleaders-TeluguStop.com

ఈ సందర్భంగా పవన్ కి కార్యకర్తల నుంచి కూడా సూచనలు అందాయి.మీరు నిత్యం ప్రజల్లో ఉంటూ, ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ స్పీడ్ పెంచాలని అప్పుడు పార్టీ మీద అందరికి నమ్మకం పెరుగుతుంది అంటూ సూచించారు.

దీనికి పవన్ సమాధానం ఇస్తూ చంద్రబాబు, లోకేష్ ప్రజాక్షేత్రంలో ఎక్కడ తిరుగుతున్నారని, జగన్ మీద కేసులు లేకపోతే ఆయన కూడా జనంలో తిరిగేవారు కాదంటూ పవన్ వ్యాఖ్యానించారు.

-Telugu Political News

ముందు జనసేన నాయకులూ, పార్టీ అభిమానులు ప్రజల్లో నిత్యం తిరుగుతూ ఉంటే పార్టీ గెలుపు సాధ్యమే అంటూ పవన్ చెప్పుకొచ్చారు.ఈ ఎన్నికల్లో జనసేన కు ప్రచారానికి సమయం సరిపోకపోవడం కూడా ఒక కారణమని పవన్ వ్యాఖ్యానించారు.అంతే కాకుండా పార్టీ లో నాయకుల మధ్య ఏర్పడిన గ్రూపు తగాదాలు కూడా మరో కారణంగా పవన్ చెప్పారు.

తనను జనంలో తిరగమని మీరంతా చెబుతున్నారని, నేను జనంలో తిరిగితే తనను అభిమానులు నలిపి పారేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు.పవన్ కల్యాణ్ ఒక్కడే పార్టీ కాదని అందరికోసం పార్టీ పెట్టానని తనకోసం కాదంటూ పవన్ ఆవేదనగా చెప్పకొచ్చారు.

-Telugu Political News

పవన్ చెబుతున్న తీరు తనను తాను బుజ్జగించుకోవడానికే అన్నట్టుగా ఉంది తప్ప ప్రజాక్షేత్రంలో ఇటువంటి లాజిక్ లు వర్కవుట్ కావు.ఎందుకంటే పవన్ కంటే ఎక్కువ చరిష్మా ఉన్న ఎన్టీఆర్, చిరంజీవి వంటివారే పార్టీ పెట్టాక నిత్యం ప్రజల్లో తిరుగుతూ తమ పరపతిని మంరింత పెంచుకున్నారు.కానీ ఆ విషయం పవన్ మర్చిపోతే ఎలా అంటూ ఆ పార్టీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు.ప్రస్తుతం పవన్ చెబుతున్న మాటలను బట్టి చూస్తే తాను నిత్యం ప్రజల్లో ఉండడం, పార్టీ కోసం పూర్తి సమయం కేటాయించడం, ప్రజా పోరాటాల్లో పాల్గొనడం ఇవన్నీ తనకు సాధ్యపడదు అన్నట్టుగానే పరోక్షంగా చెబుతున్నట్టు కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube