ఆ క్రెడిట్ ఎన్టీఆర్ కి మాత్రమే సాధ్యమైంది... పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు  

Pawan Kalyan Comments Sr Ntr Politics - Telugu Ap Politics, Janasena, Pawan Kalyan Comments, Sr Ntr Politics, Ysrcp

ఏపీ రాజకీయాలలో సినిమా వాళ్ళు ఒక పార్టీ పెట్టి ప్రయాణం చేయడం అంటే మొదటిగా ఎన్టీఆర్ పేరు వినిపిస్తుంది.తరువాత చిరంజీవి, అతని దారిలో పవన్ కళ్యాణ్ పేర్లు ప్రముఖంగా ఉంటాయి.

Pawan Kalyan Comments Sr Ntr Politics - Telugu Ap Politics, Janasena, Pawan Kalyan Comments, Sr Ntr Politics, Ysrcp-Telugu Political News-Telugu Tollywood Photo Image

అయితే ఎన్టీఆర్ తరహాలో తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చేంత స్థాయిలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ ప్రభావం చూపించలేకపోయారు.చిరంజీవి కొంతలో కొంత పర్వాలేధనుకున్న జనసేన పార్టీతో పవన్ కళ్యాణ్ అయితే దారుణమైన ఫలితాలు చూసారు.

కేవలం ఏడు శాతం ఓటింగ్ తో సరిపెట్టుకున్నారు.తాను కూడా పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు.

అంత ఇమేజ్ ఉండి పవన్ కళ్యాణ్ ఓడిపోవడం అంటే ఓ విధంగా ఆశ్చర్యకరమనే చెప్పాలి.

అయితే తాజాగా జనసేన కార్యకర్తలతో జరిగిన సమావేశంలో పవన్ కళ్యాణ్ ప్రస్తుత రాజకీయాలు, ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లో అధికారంలోకి రావడం అనేది దేశంలో కేవలం ఎన్టీఆర్ కి మాత్రమే సాధ్యమైందని అన్నారు.అలాంటి ఫీట్ ని మళ్ళీ ఎవరు కూడా రిపీట్ చేసే సామర్ధ్యం ప్రస్తుత పరిస్తితులలో లేదని తేల్చి చెప్పేశారు.

ప్రస్తుత రాజకీయాలు అన్ని డబ్బు, కులంతో నిండిపోయి స్వార్ధపూరితంగా మారిపోయాయని, ఉచితంగా పథకాలు ఏ పార్టీ ఇస్తామని అంటుందో ప్రజలు వారికే ఓట్లు వేస్తున్నారని అన్నారు.రాజకీయం అంటే డబ్బు కాదని, అందుకే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా జనసేన పార్టీ గత ఎన్నికలలో పోటీ చేసిందని ఓడిపోయినా 17 లక్షల మంది వరకు తమ భావజాలంని అర్ధం చేసుకున్నారని భవిష్యత్తులో జనసేన కచ్చితంగా మంచి ఫలితాలు చూపిస్తుందని తెలిపారు.

తాజా వార్తలు