జగన్ పై పవన్ వ్యాఖ్యలు వెనుక అసలు కధ...ఇదీ  

Pawan Kalyan Comments On Ys Jagan-

Pawan Kalyan Chandrababu Target is known to all that this is one of the biggest dramas of the time when he is fighting for Chandrababu status. Pawan Kalyan Babu with Jagan Pawan Kalyan's comments made a sensation.

Pawan Kalyan, who recently made the remarks on Target and Target, has been targeted by the latest Vice-President YS Jagan Mohan Reddy ... Pawan Kalyan's visit to Vijayawada in Vijayawada on Sunday has created sensational feelings of Jagan Pawan's comments that Pawan Kalyan does not hit the pics In the past, the AP Assembly meetings have been disclosed by the VCP.

. This stuff was basically fire on Pawan Jagan. If I had 10 MLAs who would have gone to the assembly, I would have been shocking ...

To win the 2014 elections and go to Assembly, the Assembly will stop if necessary. YS Jagan misused the opportunity of gold. The same thing happened to me, but it was not for a seat, but the assembly was going out of the protest to say that Jagan was going to tell me to say ... but Pawan Kalyan's comment on the comments made by analysts have different arguments. Pawan and Jagan are doing the same thing to the public, as Pawan has not made any comments on Jagan.

నిన్నా మొన్నటివరకూ పవన కళ్యాణ్ చంద్రబాబు ని టార్గెట్ గా చేసుకుని చేస్తూ వచ్చిన మాటల దాడులు అందరికీ తెలిసినవే.చంద్రబాబు హోదా కోసం పోరాటం చేస్తున్నాను అని చెప్పడం ఈ ఏటి అతిపెద్ద డ్రామా అని..

జగన్ పై పవన్ వ్యాఖ్యలు వెనుక అసలు కధ...ఇదీ-Pawan Kalyan Comments On Ys Jagan

ఎన్నికల సమయంలో ఇలాంటి ట్రిక్కులు బాబు చేయడంలో సిద్దహస్తుడని పవన్ కళ్యాణ్ చంద్రబాబు టార్గెట్ గా చేసిన వ్యాఖ్యలు అందరికీ తెలిసినవే అయితే ఈ సారి పవన్ కళ్యాణ్ బాబు తో పాటుగా జగన్ ని టార్గెట్ చేశారు. నువ్వొక పిరికి వాడివి జగన అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.

ఎప్పుడూ చంద్రబాబును మాత్రమే టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన జనసేనాధిపతి పవన్ కల్యాణ్ తాజాగా వైసీపీ అధినేత వైఎస్‌ జగన్ మోహన్‌రెడ్డిని టార్గెట్ చేశారు…ఆదివారం విజయవాడలోని ఉండవల్లిలో పర్యటించిన పవన్ కళ్యాణ్ జగన్ పై చేసిన విమర్శలు సంచలనం సృష్టించాయి…అయితే టీడీపీ నేతలు జగన్ పవన్ ఒకటే అంటూ చేసిన వ్యాఖ్యలకి ఇది క్లారిటీ అన్నట్లుగా పవన్ కళ్యాణ్ జగన్ పై విరుచుకు పడ్డారు.గతంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే…అయితే

ఈ విషయాన్ని బేస్ చేసుకుని పవన్ జగన్ పై ఫైర్ అయ్యారు.నాకు గనుకా 10 మంది ఎమ్మెల్యేలు ఉండి ఉంటే తప్పకుండా అసెంబ్లీ కి వెళ్లి ఉండేవాడిని జగన్ లా పారిపోయే వాడిని కాదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

2014 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి అసెంబ్లీకి వెళ్లుంటే అవసరమైతే అసెంబ్లీనే ఆపేసేవాడ్ని. బంగారం లాంటి అవకాశాన్ని వైఎస్ జగన్ దుర్వినియోగం చేసుకున్నారు..

అదే నేనైతే ఒక్క సీటు రాకపోయినా ఫర్లేదు. అసెంబ్లీ బయటే కూర్చోని నిరసన తెలిపేవాడ్ని అంటూ జగన్ కి దిమ్మతిరిగేలా కామెంట్స్ చేశారు.

అయితే పవన్ కళ్యాణ్ జగన్ పై చేసిన వ్యాఖ్యల పై విశ్లేషకులు మాత్రం భిన్నమైన వాదనలు వినిపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ పవన్ ,జగన్ లు ఒకటే అన్నట్టుగా చేస్తున్న ప్రచారం జనాల్లోకి వెళ్ళిపోవడం ఈమధ్యకాలంలో పవన్ కూడా జగన్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయక పోవడంతో ఇది నిజమే అనేట్టుగా ప్రజలు డిసైడ్ అవ్వడంతో వ్యూహంలో భాగంగానే పవన జగన్ పై వ్యాఖ్యలు చేశారని అంటున్నారు విశ్లేషకులు.

ఏది ఏమినా జగన్ పై పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం అవుతున్నాయి.