రూటు మార్చిన పవన్.... రైటేనా ..?  

  • జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత కొద్దిరోజులుగా దూకుడు పెంచారు. ఆయన ప్రసంగాలు ఆయన మాటతీరు అన్నిట్లోనూ మార్పు కనిపిస్తోంది. ప్రత్యర్థి పార్టీలను తిట్టడంలో ఏ మాత్రం మొహమాటం పడకుండా తిట్టేస్తున్నారు. ఇప్పుడు ఎవరు చూసినా… పవన్ ప్రసంగాలు మరి చర్చించుకుంటున్నారు. మొన్నటి వరకు టీడీపీ ని మాత్రమే విమర్శించిన పవన్ ఇప్పుడు వైసీపీ మీద కూడా మాటల తూటాలు వదులుతున్నారు. జనసేన వైసీపీ మధ్య చర్చలు జరుగుతున్నాయని సీట్ల బేరం కుదిరింది అని ఇలా అనేక రకాల వార్తలు వినిపించాయి. అయితే ఆ తర్వాత పవన్ ఆ విషయాలను ఖండించాడు.

  • Pawan Kalyan Comments On YS Jagan-Janasena Pawan Ycp Ys Jagan

    Pawan Kalyan Comments On YS Jagan

  • ఎన్నికల బరిలోకి జనసేన ఒంటరిగా వెళుతుందని మాకు ఎవరు సపోర్ట్ అవసరం లేదని తేల్చేశాడు. అయినా ఈ అంశం మీద ప్రజల్లో పెద్ద ఎత్తున జరుగుతుండడంతో పవన్ ఒక అడుగు ముందుకేసి జగన్ మీద విమర్శలు గుప్పిస్తున్నారు . ఇదంతా వైసీపీ జనసేన పొత్తు లేదు అని నిరూపించుకోవడానికి అని అర్థమవుతుంది. తాజాగా తూర్పు గోదావరి జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ నిర్వహించిన బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ… జగన్ గొప్ప పనులు చేసి జైలుకు వెళ్లలేదని, అవినీతికి పాల్పడి వెళ్లారని పవన్ గుర్తు చేశారు. “జగన్‌మోహన్‌రెడ్డి ఏమైనా సురవరం ప్రతాప రెడ్డా, తరిమెల నాగిరెడ్డా, రావి నారాయణరెడ్డా, పుచ్చలపల్లి సుందరరామి రెడ్డా, పుచ్చలపల్లి రామచంద్రా రెడ్డా. వాళ్లంతా జైలుకెళ్లారు. జగన్‌ కూడా జైలు కెళ్లారు. కానీ జగన్‌కు వారికీ పోలిక లేదు. వారంతా జనం కోసం జైలుకెళితే జగన్ అవినీతి కేసుల్లో జైలుకెళ్లారు” అని పవన్ విమర్శించాడు.

  • Pawan Kalyan Comments On YS Jagan-Janasena Pawan Ycp Ys Jagan
  • పుచ్చలపల్లి సుందరయ్య తన పేరు వెనుక కులం ఉండకూడదని ‘రెడ్డి’ని తొలగించుకున్నారని. ఆయన స్ఫూర్తితో తమ కుటుంబంలోనూ ఎవరి పేరులోనూ కులం ఉండదని పవన్‌ తెలిపారు. తన తండ్రి కమ్యూనిస్టని చెప్పా రు. జగన్‌ తనకు అన్ని కులాలు సమానమంటారు కానీ…. తుఫానుకు శ్రీకాకుళం జిల్లా అతలాకుతలమైనా ఆయనకు పట్టలేదన్నారు. ‘కోడికత్తి గుచ్చుకుంది. గాయమైంది’ అంటూ హైదరాబాద్‌కు వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. వేలకోట్ల అవినీతి ఆరోపణలతో జైలుకు వెళ్లి వచ్చిన జగన్‌, డబ్బు సంపాదనే ధ్యేయంగా అవినీతిలో కూరుకుపోయిన చంద్రబాబును ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారా? అని పవన్‌ ప్రశ్నించారు. 2019లో జగన్‌, పవన్‌, చంద్రబాబుల్లో ఎవరు నీతివంతమైన పాలన అందిస్తారో ఆలోచించుకుని తగిన నిర్ణయం తీసుకోవాలంటూ ప్రజలకు సూచించాడు.