ఏపీ మరో బిహార్ లో మారుతుందా! పవన్ వ్యాఖ్యలు వెనుక ఆంతర్యం  

pawan kalyan comments on ycp behave like political rowdies - Telugu Ap Cm Jagan, Ap Politics, Bjp, Janasena, Pawan Kalyan Comments. Ycp Behave Like Political Rowdies

ఏపీలో ఎన్నడూ లేని విధంగా ఈ మధ్యకాలంలో రాజకీయాలు కాస్తా విషపూరితంగా మారాయా అంటే అవుననే మాట వినిపిస్తుంది.వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతుందని విపక్షాలన్నీ ఏకమై ఒకే మాట వినిపిస్తున్నాయి.

TeluguStop.com - Pawan Kalyan Comments On Ycp Behave Like Political Rowdies

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

ఒకప్పుడు బీహార్ లో కొంత మంది నేతలు ప్రతిపక్షం అనేది లేకుండా చేసి ఎన్నికలని ఏకగ్రీవం చేసుకునేవారు.ఎవరైనా తమ మీద పోటీకి నిలబడే ప్రయత్నం చేస్తే వారిని చంపేయడం, లేదంటే దాడి చేయడం, భయభ్రాంతులకి గురి చేయడం చేస్తూ ఉండేవారు.

TeluguStop.com - ఏపీ మరో బిహార్ లో మారుతుందా పవన్ వ్యాఖ్యలు వెనుక ఆంతర్యం-Political-Telugu Tollywood Photo Image

తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఏపీలో చాలా చోట్ల అలాంటి వాతావరణమే కనిపించింది.

ఏపీలో ఇక్కడ, అక్కడ అని అనకుండా అన్ని జిల్లాలలో వైసీపీ కార్యకర్తలు ఏకపక్షంగా రెచ్చిపోయారు.

వీలైనన్ని స్థానాలు ఏకగ్రీవంగా ఎలాంటి పోటీ లేకుండా వైసీపీ సొంతం చేసుకోవాలని నాయకులకి అల్టిమేటం వెళ్ళడంతో దానికి దాడులే లక్ష్యంగా ఎంచుకున్నారు.ప్రతిపక్ష పార్టీల నుంచి నామినేషన్లు వేయడానికి వచ్చిన వారి మీద బౌతిక దాడులకి తెగబడ్డారు.

గుంపులుగా అభ్యర్ధుల మీద పడి నామినేషన్ పత్రాలు లాక్కుని చింపేయడం, అభ్యర్ధులని కిడ్నాప్ చేయడం, వారికి అండగా ఉన్న నాయకులపై పోలీసు కేసులు బనాయించి నామినేషన్ లో పాల్గొనకుండా చేయడం చేశారు.దీంతో చాలా చోట్ల వైసీపీ ఏకగ్రీవంగా ఎంపీటీసీ, జెడ్పీ స్థానాలు కైవసం చేసుకుంది.

అయితే ఈ దాడులపై బీజేపీ-జనసేన సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి వైసీపీ దాడులని తీవ్రంగా ఖండించారు.వైసీపీ పాలనలో ఏపీని మరో బీహార్ లా మార్చేస్తున్నారని, జనసేన, బీజేపీ పార్టీ నుంచి నామినేషన్లు వేయకుండా అడ్డుకొని దాడులకి పాల్పడ్డారని విమర్శించారు.

పోలీసులు కూడా అధికార పార్టీకి అండగా ఉంటూ తమ అభ్యర్ధులని అడ్డుకుంటున్నారని అన్నారు.ఇలాంటి పరిస్థితిలో ప్రజలు వైసీపీకి గట్టిగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు.

#AP CM Jagan #Janasena #AP Politics #PawanKalyan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Pawan Kalyan Comments On Ycp Behave Like Political Rowdies Related Telugu News,Photos/Pics,Images..