సినిమాల్లో తెలుగు భాష దిగజారిపోయింది : పవన్ కల్యాణ్  

Pawan Kalyan Comments On Telugu Launguage In Cinima Filed - Telugu Janasena Chief Pawan Kalyan, Pawan Kalyan, Pawan Kalyan Comments On Jagan Mohan Reddy, Pawan Kalyan Talking About Development Of Rayalaseema

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.రాయలసీమలో పర్యటిస్తున్న ఆయన తెలుగు భాష పరిరక్షణపై తెలుగు భాషాకోవిదులు, సాహితీవేత్తలు, భాషాభిమానులు, భాషా శాస్త్రవేత్తలతో ఇష్టాగోష్టి చర్చా కార్యక్రమం నిర్వహించారు.

Pawan Kalyan Comments On Telugu Launguage In Cinima Filed

ఈ సందర్భంగా తాను ఇంటర్మీడియట్ వరకు మాత్రమే చదువుకున్నానని పవన్ కల్యాణ్ చెప్పారు.తనకు ఇంగ్లీష్ అర్థం కాక నేను సగంలోనే చదువు ఆపేశానన్నారు.

ఈరోజు ఇంగ్లీష్ పదం వాడకుండా తెలుగు మాట్లాడలేక పోతున్నందుకు బాధపడుతున్నానన్నారు.సొంత భాషలో ఉన్న మాధుర్యాన్ని ఆస్వాదించే అవకాశం ఉండడం లేదన్నారు.

అలాగే సినిమాల్లో తెలుగు భాష చాలా దిగజారి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.సినిమాల్లో భాష లేకుండా చేసి విలువల్లేకుండా చూడటం వల్ల కూడా అఘాయిత్యాలు జరుగుతున్నాయన్నారు.

ప్రభుత్వం ఇంగ్లీషు ప్రవేశపెట్టే నిర్ణయంపై వ్యతిరేకత లేదు కానీ భయం మాత్రం ఉందని పవన్ కల్యాణ్ అన్నారు.అలాగే రేపిస్టులను తోలు ఊడే వరకూ కొట్టాలని అన్నారు.

అలాగే ప్రభుత్వ తప్పిదాలపై పోరాడాలని పిలుపునిచ్చారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు