రాయలసీమ కరువుపై సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్  

Pawan Kalyan Comments On Rayalaseema Backward - Telugu Janasena, Pawan Kalyan Comments, Rayalaseema Backward, Tdp, Ysrcp

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాయలసీమ పర్యటనలో ఉన్నారు.పర్యటనలో భాగంగా రైల్వేకోడూరులో ఆయన రైతుల సమావేశంలో ప్రసంగించారు.

Pawan Kalyan Comments On Rayalaseema Backward

ఈ సందర్భంగా రాయలసీమ వెనుకబాటు తనపై పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన ఈ వ్యాఖ్యలు చేశారు.రాయలసీమ అంటే రతనాలసీమ అని, అలాంటి రాయలసీమను పాలకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య అంతరం సృష్టించి కరువు జిల్లాగా మార్చారని అన్నారు.

ఇక్కడి నుంచి ఎంతోమంది పాలకులు కూడా ఎవరు కూడా అభివృద్ధిపై దృష్టి పెట్టలేదని, ప్రజలను కేవలం తన అవసరాల కోసం వాడుకుని వదిలేశారని అన్నారు.

రాయలసీమలో సారవంతమైన భూములు ఉన్నాయని, మంచి పంటలు పండుతాయని అలాంటి భూములని బీడు భూములుగా మార్చేసి ప్రజలని వలస కార్మికులుగా మార్చేసిన ఘనత ఇక్కడి పాలకులు లభిస్తుందన్నారు.

తాను కులమతాలకు అతీతంగా రాజకీయాలు చేయడానికి వచ్చానని, రాబోయే భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నాను అని అన్నారు.ఓటమి తాను చేస్తున్న పోరాటాన్ని ఆపలేదని అన్నారు.

అధికార పార్టీ వైసిపి జన సైనికులకు దాడులు చేసిన, అక్రమంగా బెదిరించే ప్రయత్నం చేసిన సహించాలని, మనం చూసే చూపుతో వారి ఊపిరి ఆగిపోయే పరిస్థితి వస్తుందని అన్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు