కియా వార్తలపై పవన్‌ ఏమన్నాడంటే

ఏపీలో ప్రతిష్టాత్మకంగా నెలకొల్పబడ్డ కియా కార్ల తయారి ప్లాంట్‌ కొన్ని కారణాల వల్ల తమిళనాడుకు తరలి వెళ్లబోతుంది అంటూ ఒక అంతర్జాతీయ మీడియా సంస్థ కథనంను రాయడం జరిగింది.దాంతో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ చర్చ మొదలైంది.

 Pawan Kalyan Comments On Kia-TeluguStop.com

జగన్‌ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు మరియు ఇతరత్ర కారణాల వల్లే ఈ పరిస్థితి అంటూ తెలుగు దేశం పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇదే సమయంలో తెలుగు దేశం పార్టీ తీసుకు వచ్చిన కియాను కాపాడుకోలేక పోవడం సిగ్గు చేటు అంటూ ప్రజలు కూడా విమర్శలు చేస్తున్నారు.

వైకాపా మరియు కియా కంపెనీ ప్రతినిధులు మాత్రం ఆ వార్తలను కొట్టి పారేశారు.తాజాగా పవన్‌ ఈ విషయమై స్పందించారు.ఒక వైపు రాష్ట్రం నుండి పరిశ్రమలు తరలి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుంటే మరో వైపు మీరు ఎలా యువతకు ఉపాది అవకాశాలు కల్పిస్తారంటూ ప్రశ్నించారు.రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు నెలకొల్పేందుకు అనుకూల వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, అలా కాదని ఉన్న కంపెనీలను కూడా వెళ్లి పోయేలా చేస్తే భవిష్యత్తులో ఉపాది కోసం యువత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ పవన్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube