'జానీ'తో వచ్చిన డబ్బుతో ఆ పని చేయాల్సిందని బాధపడుతున్న పవన్‌ కళ్యాణ్‌  

Pawan Kalyan Comments On Johny Movie Telugu-pawan Kalyan,tollywood Hero Pawan Kalyan

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా జానీ చిత్రం వచ్చి చాలా సంవత్సరాలు అయ్యింది.ఇప్పటికి ఆ సినిమా గురించి మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి.

Pawan Kalyan Comments On Johny Movie Telugu-pawan Kalyan,tollywood Hero Pawan Kalyan Telugu Tollywood Movie Cinema Film Latest News Pawan Kalyan Comments On Johny Movie Telugu-pawan Tollywood Hero-Pawan Kalyan Comments On Johny Movie Telugu-Pawan Tollywood Hero

ఆ సినిమాకు పవన్‌ దర్శకత్వం కూడా చేశాడు.అల్లు అరవింద్‌ నిర్మించిన ఆ సినిమాకు పవన్‌ కళ్యాణ్‌ రెండు కోట్ల పారితోషికం తీసుకున్నాడట.

అప్పట్లో రెండు కోట్లు అంటే భారీ పారితోషికం.దర్శకత్వం చేయడంతో పాటు హీరోగా నటించాడు పవన్‌.అలాగే ఆయన భార్య రేణు దేశాయ్‌ కూడా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించి కీలకమైన టెక్నికల్‌ అంశాలను చూసుకుంది.

జానీ సినిమా చేసిన సమయంలో వచ్చిన డబ్బుతో తాను మాదాపూర్‌లో 30 ఎకరాల భూమిని కొనుగోలు చేసుకునే అవకాశం ఉండేది.

అప్పుడు చాలా మంది నన్ను భూమి కొనుగోలు చేయమని సూచించారు.కాని నేను మాత్రం ఆ విషయాన్ని అశ్రద్ద చేశాను.

ఇప్పుడు ఆ భూమికి వేల కోట్ల రేటు ఉన్న విషయం తెల్సిందే.ఈ విషయాన్ని స్వయంగా పవన్‌ కళ్యాణ్‌ చెప్పడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

సంపాదించిన డబ్బును సరైన మార్గంలో ఖర్చు చేస్తూ వస్తే మంచి ప్రయోజనం ఉంటుందని ఆయన మాట ద్వారా తెలుస్తోంది.

పవన్‌ కళ్యాణ్‌ ఆర్థికంగా ఎంతో సంపాదించినా కూడా ఆయన చేసే దాన కార్యక్రమాల వల్ల ఎప్పటికప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటాడని ఆయన సన్నిహితులు అంటారు.వదిన సురేఖ వద్ద కోట్ల రూపాయల అప్పు తీసుకున్నట్లుగా ఆమద్య ఎన్నికల అఫిడవిట్‌లో పవన్‌ కళ్యాణ్‌ పేర్కొన్న విషయం తెల్సిందే.అప్పట్లో పవన్‌ వచ్చిన పారితోషికంను మంచిగా ఉపయోగించి ఉంటే తప్పకుండా మంచి పొజీషన్‌లో ఉండేవాడు.

ఇప్పుడు ఆయన పొజీషన్‌కు వచ్చిన డోకా ఏమీ లేదు.కాని ఆర్ధికంగా మాత్రం ఇంకా బెటర్‌గా ఉండేవాడు అనేది ఆయన అనుచరుల అభిప్రాయం.

తాజా వార్తలు